Tollywood Couples : ఈ మధ్య సినీ సెలబ్రిటీలు విడాకులతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడుతూ అనసవరంగా వైవివాహిక జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఎంత మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఈ ఏడాది విడాకులతో పెద్ద షాక్ ఇచ్చిన జంట ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్. వీరిద్దరు 2004లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వారు 18 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఇక ఎ.ఆర్. రెహ్మాన్, సైరా బాను జంట కొద్ది రోజుల క్రితం 29 సంవత్సరాల వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టారు.
పర్సనల్ రీజన్స్ వలన , ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎ. ఆర్. రెహ్మాన్ తన భార్య నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ఎ.ఆర్. రెహ్మాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ నటి ఊర్మిళ మొహ్సిన్ తన జీవిత భాగస్వామి మోహసిన్ అక్తర్ మీర్‌ను ఈ ఏడాది వదిలేశారు. పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత తన భర్త మొహ్సిన్ అక్తర్ మీర్ నుంచి ఆమె విడాకులు పొందారు.భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి 2024లో తమ విడాకులు ప్రకటించారు. విడాకుల తర్వాత, షోయబ్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ పెళ్లయిన 4 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటి నుంచో హాట్ హాట్ చర్చల తర్వాత ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
హేమ మాలిని కుమార్తె ఈషా డియోల్, భరత్ తఖ్తానీ కూడా ఈ సంవత్సరం విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అర్జున్ కపూర్, మలైకా అరోరా తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరకు వారిద్దరు కూడా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.