Theatres : రేపు థియేట‌ర్స్‌లో ఎన్ని సినిమాలు విడుద‌ల కానున్నాయి.. ఏ సినిమాపై అంచ‌నాలున్నాయంటే..!

Theatres : రేపు థియేట‌ర్స్‌లో ఎన్ని సినిమాలు విడుద‌ల కానున్నాయి.. ఏ సినిమాపై అంచ‌నాలున్నాయంటే..!

Theatres : డిసెంబ‌ర్ 5న అల్లు అర్జున్ న‌టించిన పుష్ప చిత్రం భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. తెలుగుతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీకి పోటీగా మ‌రే ఇత‌ర సినిమాని రిలీజ్ చేయ‌డానికి ఎవ‌రు ఆస‌క్తి చూప‌డం లేదు.పుష్ప‌2తో ఢీకొనే బ‌దులు తాము నిర్మించిన సినిమాల‌ని ముందో వెన‌కో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు ప‌లు చిన్న సినిమాలు రాబోతున్నాయి. ఇవి ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధ‌మయ్యాయి. గత శుక్రవారం ఐదుకుపైగా చిత్రాలు విడుదల కాగా, అవి థియేట‌ర్స్‌లోకి రావ‌డం వాటిని థియేటర్ల నుంచి తీసివేసిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు.

ఇప్పుడు న‌వంబ‌ర్ 29వ తేదీన రానున్న చిత్రాల‌పై అయితే కొంత దృష్టి సారించారు 9 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ 9 చిత్రాలు కోలీవుడ్‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. లిస్ట్ చూస్తే.. ‘అందనాల్‌’, ‘డబ్బాంకుత్తు’, ‘మాయన్‌’, ‘మిస్‌ యూ’, ‘సొర్గవాసల్‌’, ‘పరమన్‌’, ‘సైలెంట్‌’, ‘తిరుంబిపార్‌’, ‘సాదువన్‌’ మూవీలున్నాయి. వీటిలో ఒకప్పుడు లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందిన సిద్ధార్థ్ – ఆషికా రంగనాథ్‌ నటించిన ‘మిస్‌ యూ’, ఆర్జే బాలాజీ , సానియ అయ్యప్పన్‌ నటించిన ‘సొర్గవాసల్‌’ ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు మాత్రం ఎక్కువ థియేటర్లలో విడుదలకానున్నాయి. ఈ రెండు చిత్రాల‌పై ఫోక‌స్ ఎక్కువ‌గానే ఉంది. మ‌రోవైపు మిస్ యూ చిత్రాన్ని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ రిలీజ్‌ చేస్తుండగా, ‘సొర్గవాసల్‌’ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ విడుదల చేస్తోంది.

దీంతో ఈ రెండు చిత్రాలపై ఇటు సినీ వర్గాలు, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మిస్ యూ సినిమా తెలుగులోను సంద‌డి చేయ‌నుంది.ఇక భైరతి రణగల్ అనే చిత్రం కూడా టాలీవుడ్‌లో సంద‌డి చేయ‌నుంది. శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కన్నడ హిట్ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 29న తెలుగులో విడుదలకు సిద్ధమైంది. రాహుల్ బోస్, రుక్మిణి వసంత్ ముఖ్య పాత్రల్లో నటించగా, నర్తన్ దర్శకత్వం వహించారు.