వెల్లుల్లితో అనేక ప్ర‌యోజ‌నాలు.. కానీ 99 శాతం మందికి దీన్ని ఎలా తినాలో తెలియ‌దు..!

వెల్లుల్లితో అనేక ప్ర‌యోజ‌నాలు.. కానీ 99 శాతం మందికి దీన్ని ఎలా తినాలో తెలియ‌దు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే వెల్లుల్లిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లోనే కాదు, ఔష‌ధంగా కూడా వాడుతుంటారు. ప‌ప్పు దినుసుల‌తోపాటు ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి వెల్లుల్లిని వండుతారు. అనేక ర‌కాల మెడిసిన్ల త‌యారీలోనూ వెల్లుల్లిని ముఖ్య‌మైన ప‌దార్థంగా ఉప‌యోగిస్తారు. పూర్వం దేవ‌త‌లు, రాక్ష‌సులు అమృతం కోసం క్షీర‌సాగ‌ర మ‌థ‌నం చేసిన‌ప్పుడు అమృతం చుక్క‌లు కొన్ని నేల మీద ప‌డ్డాయ‌ట‌. దాంతో వెల్లుల్లి మొక్క పెరిగింద‌ని చెబుతారు. క‌నుక వెల్లుల్లిని అమృతంగా భావిస్తారు. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

వెల్లుల్లితో అనేక రోగాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా దీంతో బ‌రువు త‌గ్గుతారు. వెల్లుల్లి వ‌ల్ల దంతాలు దృఢంగా మారుతాయి. కండ‌రాలు, జుట్టు, గోళ్లు, చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణాశ‌యంలో ఉండే పురుగుల‌ను వెల్లుల్లి చంపేస్తుంది. ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది. కంటి స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంది. ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌వారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే ఫ‌లితం ఉంటుంది.

99 percent of people do not know how to take garlic

ఆయుర్వేదంలో వెల్లుల్లి వల్ల మ‌న‌కు ఎన్ని ఉప‌యోగాలు క‌లుగుతాయో వివ‌రంగా చెప్పారు. అయితే చాలా మందికి దీన్ని ఎలా తీసుకోవాలో తెలియ‌దు. వెల్లుల్లిని అస‌లు ఎలా తినాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లిని రోజుకు 4 నుంచి 5 గ్రాముల మోతాదులో తీసుకోవ‌చ్చు. ఇంత‌కు మించి వెల్లుల్లిని తింటే మ‌న ఆరోగ్యానికి మంచిది కాదు. వెల్లుల్లిని ముందుగా పొట్టు తీసి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. వాటిని కాస్త దంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని వ‌ల్ల వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే స‌మ్మేళ‌నం ఉత్ప‌త్తి అవుతుంది. ఇది మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగాల‌ను తగ్గిస్తుంది. త‌రువాత ఆ వెల్లుల్లి మిశ్ర‌మాన్ని నేరుగా అలాగే తినేయాలి. వెల్లుల్లి ఘాటు ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక నేరుగా తిన‌లేమ‌ని అనుకునేవారు అందులో కాస్త తేనె క‌లిపి తినాలి.

మీరు గ‌న‌క ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేసే మందుల‌ను వాడుతుంటే వెల్లుల్లిని తిన‌డంలో మీరు మీ డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకోవ‌డం ఉత్త‌మం. లేదంటే మీరు వాడే మందుల‌పై వెల్లుల్లి ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. ఇక ప‌చ్చి వెల్లుల్లి కొంద‌రికి ప‌డ‌దు. దీంతో అల‌ర్జీలు వ‌స్తాయి. అలాంటి వారు వెల్లుల్లిని పెనంపై కాస్త వేయించి తిన‌వ‌చ్చు. ఇలా వెల్లుల్లిని తింటే ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వెల్లుల్లిని తిన‌డం వ‌ల్ల మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. శిరోజాలు ఒత్తుగా దృఢంగా పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి.

వెల్లుల్లిని తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా జీర్ణాశ‌య‌, బ్రెస్ట్ క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. వెల్లుల్లి ర‌సాన్ని మీరు నేరుగా జుట్టుకు ప‌ట్టించ‌వ‌చ్చు. దీని వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ చిట్కాను క‌నీసం 60 రోజుల పాటు పాటిస్తే ఫ‌లితం ఉంటుంది. వెల్లుల్లిని ఇలా వాడ‌డం వ‌ల్ల చుండ్రు నుంచి సైతం బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దంతాలు, చిగుళ్లు నొప్పిగా ఉంటే కాస్త వెల్లుల్లి ర‌సాన్ని అప్లై చేస్తే నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దంతాలు, చిగుళ్ల‌ను వెల్లుల్లి ఆరోగ్యంగా ఉంచుతుంది. వెల్లుల్లిని తింటుండ‌డం వ‌ల్ల ద‌గ్గు నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వెల్లుల్లిని తింటే హార్ట్ ఎటాక్ వ‌చ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయ‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

ముఖంపై ముడ‌త‌ల‌ను త‌గ్గించ‌డంలో, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్లు, వాపుల‌ను త‌గ్గించ‌డంలోనూ వెల్లుల్లి అద్భుతంగా ప‌నిచేస్తుంది. వెల్లుల్లిని రోజూ తిన‌డం వ‌ల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ కాస్త వెల్లుల్లి ర‌సాన్ని తాగితే కిడ్నీ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. టీబీ, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా వెల్లుల్లిని రోజూ తింటుంటే ఎంత‌గానో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఆయా వ్యాధుల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా వెల్లుల్లితో మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.