Karthika deepam 2 serial today november 19th episode : కార్తీక దీపం2 సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. తాజా ఎపిసోడ్లో రెస్టారెంట్లో పని చేస్తున్న వ్యక్తి కార్తీక్ గొప్పదనం గురించి చెబుతూ ఉంటాడు. రెస్టారెంట్ లో స్టాఫ్ పిల్లలను కూడా సార్ చదివిస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ దీప దగ్గరకు వెళ్లి తాను మంచి పనులు చేయడానికి కారణం నువ్వే దీప అంటాడు. మీలా ఏ కుటుంబం బాధపడకూడదని తన దగ్గర పని చేసే అందరికీ ఇన్స్యూరెన్స్ చేయించానని చెప్తాడు. పిల్లలను చదివించాలనే ఆలోచన శౌర్య వల్ల వచ్చిందని చెప్పుకొస్తాడు. మీ మంచితనం గురించి తెలుస్తున్న కొద్ది చాలా గొప్పగా అనిపిస్తున్నారని దీప అనుకుంటుంది.అయితే ఎందుకో దీప చాలా ఆవేశంగా జ్యోత్స్న రెస్టారెంట్ కు వస్తుంది. బోర్డు మీద ఉప్మా బిర్యానీ చూసి ఎవరు రాశారని అడుగుతుంది.
కార్తీక్ సర్ వైఫ్, పాప వచ్చారు. మేడమ్ స్వయంగా వంట చేస్తున్నారని మేనేజర్ చెప్తాడు. దీప మేడమ్ కిచెన్ లో ఉప్మా బిర్యానీ చేస్తున్నాడని అనేసరికి జ్యోత్స్న లాగిపెట్టి కొడుతుంది. నీకు మేడమ్ నేనే దీప కాదని అంటుంది. జ్యోత్స్నకు దీప ఎదురుపడుతుంది. మా రెస్టారెంట్ లో జాయిన్ అయిన వంట మనిషివి నువ్వేనా అని నోటికొచ్చినట్టు అనేసరికి ఆ సమయంలో కార్తీక్ వచ్చి జ్యోత్స్నను ఆపుతాడు. దీపను ఎందుకు రెస్టారెంట్ కు ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అని అనగా, అప్పుడే అక్కడకి వచ్చిన శివనారాయణ … నీతో తేల్చుకోవడం కోసం వచ్చాను అంటూ పేపర్ లో ఫోటో చూపించి సమాధానం చెప్పమని అడుగుతాడు. ఇది ప్రశ్న కాదు సమాధానం. నా పెళ్లి గురించి అందరికీ తెలియాలని అనుకున్నాను. అందుకే పేపర్ లో వేయించానని చెప్తాడు.
నీ పేరు పక్కన జ్యోత్స్న గ్రూప్స్ ఆఫ్ సీఈవో అని ఎందుకు రాశావని కోపంగా అడుగుతాడు. అది తన పోస్ట్ అని అంటాడు. పక్కకి వెళ్ళి మాట్లాడదామని అంటే పెళ్ళాం ముందు పరువు పోతుందా? నీది మీ నాన్న బుద్ధి.మీరంతా అవకాశవాదులు. అవకాశానికి తగినట్టు వాడుకుంటారని అంటుంటే దీప ఆపబోతుంది. నువ్వు మాట్లాడకు నిన్ను చూస్తుంటే కంపరంగా ఉంది. మొదట నా ఇంట్లో చేరావ్, ఇప్పుడు నా కూతురు ఇంట్లో చేరావు. ఇప్పుడు రెస్టారెంట్ లో చేరావని తిడతాడు.పేపర్ లో ప్రకటన వస్తే నీ పరువు పోయిందని అనుకుంటే మాకు నీకు ఏ సంబంధం లేదని ప్రకటన ఇచ్చుకో తాత. మా అమ్మతో పుట్టింటి బంధాన్ని దూరం చేశారు. ఇప్పుడు మాట్లాడకపోతే పేర్లతో ఉన్న బంధం కూడా దూరం చేసేలా ఉన్నారని కార్తీక్ అంటాడు.
దీప మెడలో తాళి కట్టినప్పుడు గుర్తు రాని పేర్లు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? పేపర్ లో మీ నాన్న పేరు వేయించకోలేదు ఎందుకు పరువు పోతుందని కదా. విలువలు లేని మనిషి కోసం అందరినీ కాదని మా పరువు రోడ్డున పెట్టావని శివనారాయణ కోపంగా అంటాడు. కార్తీక్ అనేసరికి శివనారాయణ కోపంగా మనవడి మీదకు చెయ్యి ఎత్తుతాడు. కానీ దీప పెద్దాయన చేతిని ఆపుతుంది. కార్తీక్ బాబు ఒంటి మీద చేయి పడటానికి వీల్లేదు అది ఎవరి చెయ్యి అయినా సరే అని దీప అనేసరికి శివనారాయణ చేయి దించుతాడు. క్షమించండి తాతగారు మిమ్మల్ని అవమానించడానికి అడ్డుకోలేదు. నా కార్తీక్ బాబు ఆత్మాభిమానం కాపాడుకోవడానికని దీప చెప్తుంది. మీ తాత పేరు ఏంటని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలని కార్తీక్ బాధగా అడుగుతాడు. నాకు తాత లేడు చచ్చాడు అని చెప్పమని పెద్దాయన కోపంగా అనడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.