Gunde Ninda Gudi Gantalu November 19th : గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం ఎపిసోడ్లో బాలు ఫుల్లుగా తాగి వచ్చి అత్తగారి ఇంటి వద్ద నానా హంగామా చేస్తాడు. తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. బాలు ప్రవర్తనను చూసి పార్వతి ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయం బాలు నిద్రలేచి.. హ్యాంగ్ ఓవర్ తో ఇబ్బంది పడతాడు. రాత్రి ఏదైనా తేడాగా మాట్లాడానా అంటూ తన అత్తగారిని అడగగా, అదేంలేదు బాబు అంతా బాగానే ఉందంటూ కవర్ చేస్తుంది పార్వతి. కానీ శివ వచ్చి.. నువ్వు తిట్టడంతో మా అక్కయ్య మీ ఇంటికి వెళ్ళిపోయింది అని చెబుతాడు. దీంతో బాలు సీరియస్ అయి.. ఎవరైనా మొగుడు తిడితే.. అమ్మగారింటికి వస్తారు. కానీ, మీనా మాత్రం అత్తగారింటికి వెళ్లిందా? అని వ్యంగంగా మాట్లాడుతాడు. మీనా తనకు చెప్పకుండా అత్తగారింటికి వెళ్లిందని బాలు ఫైర్ అయితాడు. దీంతో.. మీనా తల్లి సర్ది చెప్పి.. పండుగ కానుకగా ఉంగరం ఇస్తుంది.
అయితే తనకు ఎలాంటి కానుకలు వద్దని బాలు చెప్పగా, మీనా తల్లి పార్వతి పట్టు పట్టి.. తన సంతోషం కోసమైనా ఉంగరం తీసుకోవాలని చెప్పడంతో.. బాలు ఉంగరం తీసుకుని ఇంటికి వస్తాడు. మరోవైపు తెల్లవారగానే మీనా ఇంటి ముందు ముగ్గు వేయడం చూసి మౌనిక షాక్ అవుతుంది. మీనాను చూసి ప్రభావతి కూడా షాక్ అవుతుంది. పండుగ పూట కూడా మీ ఇంట్లో వారికి తీరిక లేకుండా ఉన్నారా? పూల గిరాకి ఎక్కువ ఉందని గుడి దగ్గరే ఉండిపోయారా? అంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది.. దీంతో సత్యంకు కోపం వచ్చి.. అసలు ఎందుకు వచ్చిందో అడగకుండా.. నోరు ఎందుకు పడేసుకుంటున్నావ్ అంటూ ప్రభావతిని తిడుతాడు. అప్పుడు మీరు సరిగ్గా తింటున్నారా లేదా టాబ్లెట్ వేసుకున్నారో లేదోనని ఆలోచించినారని అందుకే తెల్లవారుజామున ఇద్దరం ఇంటికి వచ్చామంటూ మీనా అబద్ధం చెపుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాలు తనకు చెప్పకుండా ఒంటరిగా ఇంటికి ఎందుకు వచ్చావు.. నీకు అసలు బుద్ధి ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
దీంతో కోపం వచ్చినా మీనా.. నిన్న రాత్రి పీకలదాకా తాగి వచ్చి.. నన్ను నానా మాటలు తింటారు. మీరు అన్నమాటలకు మా అమ్మ చాలా బాధపడింది. పండుగ పూట వారిని బాధపడ్డకూడదనే ఉద్దేశంతో ఇంటికి వచ్చేసానంటూ చెబుతుంది. మామయ్యకు అన్ని విషయాలు చెప్పానని, మెయిన్ మీరు తాగి వచ్చి గొడవ చేశారని, రాత్రి పూట ఓనర్ ఆంటీ వాళ్ళ డోర్ కొట్టారని, నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారని, ఇలా అన్ని విషయాలు చెప్పానని బాలుని ఆటపట్టిస్తుంది మీనా. దీంతో బాలు.. నా ముఖం ఎలా చూపించాలి. మళ్లీ నేను తాగవచ్చానంటే మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడు’ అంటూ టెన్షన్ పడతాడు.ఆ తర్వాత మీనా మీరేమి టెన్షన్ పడకండి, అలా ఏం చెప్పలేదు. మిమ్ములను చూడకుండా బాలు ఉండలేకపోయారని, అందుకే తెల్లవారగానే వచ్చేసామని చెప్పానని మీనా చెబుతుంది.
ఆ తర్వాత మళ్లీ బాలు.. మీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో బాలు కాస్త కూల్ అవుతాడు. ఇంతలోనే బాలు నానమ్మ సుశీలమ్మ వస్తుంది. వారి గొడవను అబ్జర్వ్ చేసి.. బాలుకి క్లాస్ పీకుతుంది. ఇంట్లోకి వెళ్లి అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. తన అత్తయ్య వచ్చారని తెలియగానే ప్రభావతి వణికి పోతుంది.శీల డార్లింగ్.. బాలుని పిలిచి ఏంట్రా ఇంట్లో కారు కనిపించడం లేదు అని ప్రశ్నిస్తుంది. కారు టూర్ కు వెళ్లిందని కవర్ చేస్తాడు. కారు ఎక్కడికి వెళ్లిన గంటలో ఇంటి ముందుకు రావాలి. అందరం గుడికి వెళ్దాం అంటూ ఆర్డర్ వేస్తుంది సుశీలమ్మ. దీంతో లేని కారును ఎలా తీసుకురావాలని బాలు తీవ్రంగా ఆలోచిస్తాడు. అనవసరంగా పండగ పూట అక్కడ ఉండకుండా.. ఇక్కడికి వచ్చి చిక్కుల్లో పడ్డావు అంటాడు సత్యం. కనీసం అద్దె కారు అయినా తీసుకురా అని చెబుతాడు సత్యం. మరోవైపు శిలా డార్లింగ్ ను తన రూమ్ కి తీసుకువెళ్తుంది మీనా. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొంత సేపు చర్చ నడుస్తుంది.