Brahmamudi Serial Today November 19th Episode : బ్రహ్మముడి సీరియల్ గత ఎపిసోడ్లో కావ్య, శృతి డిజైన్స్ అక్కడే పెట్టి ఆఫీసు నుండి వెళ్లిపోతారు. అయితే అప్పటికే గుంట నక్కలా కాచుకొని కూర్చొని ఉన్న రాజ్ దొంగతనంగా వచ్చి వాటి ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. ఇంత మంచి డిజైన్స్ వేసిందా అని మెచ్చుకుంటూనే ఫోటోలు తీసుకుంటుండగా కావ్య బ్యాగ్ మర్చిపోయాను అని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. కావ్య ను చూసి లోపల దాక్కుంటాడు రాజ్ .. డిజైన్స్ పొజిషన్ మారి ఉండటంతో కావ్యకు ఇక్కడకు ఎవరో వచ్చారని చెబుతుంది కావ్య. దెయ్యాలు ఏమైనా ఉన్నాయా అని శ్రుతి అంటే.. నీ బొంద ఎవరో వచ్చి వెళ్లారు అని కావ్య అంటుంది. రాజ్ సర్ ఏమైనా వచ్చారా. మీ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూద్దామని, మిమ్మల్ని దెబ్బ కొట్టాలని వచ్చారేమో అని శృతి అంటుంది.
ఆయనకి కోపం, గర్వం ఎక్కువ. అంతే తప్ప మోసం చేసే గుణం లేదు అని అని శృతి, కావ్యలు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇక హమ్మయ్య అనుకుంటూ చైర్లో కూర్చుంటాడు రాజ్. ఆ తర్వాత దుగ్గిరాల ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుండగా ధాన్యలక్ష్మీ మాత్రం తనకోసం సపరేట్గా వంటకాలు తయారు చేయించుకొని వచ్చి తెగ తినేస్తూ ఉంటుంది.అది చూసిన స్వప్న అడగడంతో తను వంటింట్లో వేరు కుంపటి పెట్టింది అని అంటుంది ఇందిరాదేవి. ధాన్యలక్ష్మి బాధ మీకు ఎవరికీ అర్థం కావడం లేదా నాన్న అని అంటుంది రుద్రాణి. ఒకప్పుడు స్వాతంత్య్రం కోసం బట్టలు బహిష్కరించినట్లు.. తను అనుకుంది జరగడం కోసం నా కోడలు ఇంట్లో తిండిని బహిష్కరించింది అని ఇందిరాదేవి అంటుంది.
ధాన్యలక్ష్మీ బాధ అందరికీ అంత వెటకారం అయిందా. ఇలా దెప్పిపొడవం పెద్దరికి అనిపించుకోదు. ఏంటీ నాన్న కోడలికి అవమానం జరిగితే మౌనంగా ఉన్నారు అని రుద్రాణి అంటుంది. నా కొడుకు అన్యాయం జరిగినప్పుడే మౌనంగా ఉన్న మావయ్య నాకు అవమానం జరిగితే స్పందిస్తారా అని ధాన్యలక్ష్మీ అంటుంది.ధాన్యలక్ష్మీ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావ్ అని రుద్రాణి అంటుంది. నా కోడలికి సెపరేట్‌గా వంట చేసుకోడానికి పాత్రలు అవి సరిపోతాయో లేదో, కొత్తగా ఏమైనా కావాలో తీసుకొచ్చి ఇవ్వు అని సీతారామయ్య అని పెద్ద పంచ్ ఇస్తాడు. మరొకవైపు రాజ్ దొంగతనం చేసిన ఆ డిజైన్స్ చూసి కళావతికి బాగానే టాలెంట్ ఉంది అని లోలోపల మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి సీతారామయ్య వస్తాడు. ఏంటి నేను రాగానే లాప్టాప్ క్లోజ్ చేస్తున్నావు అనగా నేను వేసిన డిజైన్స్ రేపు డెమో చూపించిన తర్వాత మీకు చూపిస్తాను నా టాలెంట్ ఏంటో నిరూపించుకుంటాను అని అంటాడు రాజ్.
అయితే మీ ఇద్దరిలో ఎవరు గెలిచిన కాంట్రాక్ట్ మన కంపెనీకే వస్తుంది. కానీ, ఎవరు ఓడిపోయినా నేను అనుకుంది జరగదు. టెన్షన్ నీకు కాదు మాకు ఇక పడుకో అని సీతారామయ్య వెళ్లిపోతాడు. అసలు ఆ కళావతి వచ్చి డెమో ఇవ్వకుండా చేయబోతున్నానని తెలిస్తే తాతయ్య ఏమైపోతారో అని రాజ్ కన్నింగ్‌గా ఆలోచిస్తాడు.తప్పకుండా నేనే గెలుస్తాను అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతూ ఉంటాడు రాజ్. తర్వాత కావ్య అని ఎలా అయినా ఆఫీస్ కి రాకుండా చేయాలనే రాజ్ డ్రైవర్ కి ఫోన్ చేసి కొంచెం లేటుగా కావ్యని ఆఫీస్ కీ తీసుకుని రా చెబుతాడు. కాంపిటీషన్ గురించి దుగ్గిరాల ఫ్యామిలీ ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అపర్ణ మాత్రం అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే రాజ్ సూటు బూటు వేసుకొని అక్కడికి వస్తాడు. సీఈఓ గా గెలిచేది నేనే అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతూ స్టైల్‌గా ఎంట్రీ ఇస్తాడు. నేను గెలిస్తే మాత్రం కళావతి ఎప్పటికి ఆఫీస్‌లో కానీ, ఇంట్లో కానీ అడుగుపెట్టొద్దు అని తల్లిని ఆశీర్వాదం అడుగుతాడు రాజ్. పిల్ల పాపలతో చల్లగా ఉండమని అపర్ణ దీవిస్తుంది.