Karthika Deeapam November 23 : కార్తీక దీపం తాజా ఎపిసోడ్లో దీప చాలా ఎమోషనల్ అవుతుంది. కార్తీక పౌర్ణమి గురించి చెప్పాలని దీపను జ్యోత్స్న అడుగుతుంది. దీంతో దీప వివరిస్తుంది. ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరు దీపాలు వెలిగించేందుకు సిద్ధమవుతారు. తన అమ్మ దీప వదిలిన దీపమే ముందుగా వెళుతుందని శౌర్య అంటుంది. ఏదో బలమైన కోరికే కోరి ఉంటుందని కార్తీక్ అంటాడు. దీప వదిలిన దీపాన్ని పడేసేందుకు రాయి విసురుతుందని జ్యోత్స్న. దీన్ని చూసి ఆమెను కాస్త నెడతాడు కార్తీక్. దీంతో గురి తప్పి తన దీపాన్నే రాయితో కొడుతుంది జ్యోత్స్న. దీంత తన దీపమే మునిగిపోతుంది.దీప వదిలిన దీపాన్ని ముంచాలని కుట్ర చేసి తన దీపాన్ని కొట్టిన జ్యోత్స్నపై పంచ్‌లు వేశాడు కార్తీక్.
“కష్టాలు వచ్చినా నిలబడేవి కొన్ని ఉంటాయి. అవి నిజాయితీగా దేవుడి వద్దకు చేరతాయి. దీప వదిలిన కార్తీక దీపం అలాంటిదే. నిజాయితీ లేని కోరికలు కొన్ని ఉంటాయి. అవి దేవుడి వద్దకు చేరేలోపే కష్టాల్లో కొట్టుకుపోతాయి. నువ్వు వదిలిన దీపం అలాంటిదే. ఎవరికి చెడు చేయాలని చూడకు. అది నీకే రివర్స్ అయి ఏడ్వడానికి కన్నీళ్లే తప్ప ఇంకేమీ మిగలవు” అంటూ జ్యోత్స్నకు బుద్ధి చెబుతాడు కార్తీక్. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతారు. “దేవుడి కోసం వెలిగించి కోనేటిలో వదిలిన కార్తీక దీపాల సాక్షిగా చెబుతున్నా. అప్పుడు.. ఇప్పుడు నేను నీ శ్రేయోభిలాషినే దీప. నీ శ్రేయస్సును, సుఖాన్ని, సంతోషాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే ఆత్మీయ మిత్రుడిని. ఇవన్నీ కూడా ఒక భర్తగా కార్తీక దీపాల సాక్షిగా చెబుతున్నానని, ఎప్పుడూ నీ శ్రేయోభిలాషినే. ఇవన్నీ నేను ఓ భర్తగా కోరుకోవడంలో తప్పులేదు.
అలాగని నువ్వు ఇవ్వని చనువు తీసుకోను. అవి నీ మనసును బాధ పెట్టవచ్చు” అని కార్తీక్ అంటాడు. తనతో ఎప్పుడూ భార్యలాగే ఉండాల్సిన అవసరం లేదని, స్నేహితురాలిగా ఉండొచ్చని అంటాడు. తనతో అన్ని విషయాలు చెప్పుకోవచ్చని చెబుతాడు. గుడిలో జరిగిన విషయాన్ని తలుచుకొని ఇంట్లో ఏడుస్తుంది జ్యోత్స్న. పారిజాతం ఆమెకు మరింత కోపం తెప్పించేలా మాట్లాడుతుంది. ఏం చేసిన రివర్స్ అవుతూ.. నీకు ఎదురుదెబ్బ తగులుతోందని అంటుంది. ఎప్పుడైనా నష్టం నీకే జరుగుతోందని చెబుతుంది. భార్యగానే కాదు, మరదలిగానూ బావ మనసులో లేనని, అత్త కూడా పరాయి మనిషిలాగే చూసిందని జ్యోత్స్న బాధపడుతుంది.
ఇష్టం లేనప్పుడు, అవసరాలు తీరినప్పుడు మనుషులు అలానే చేస్తారని పారిజాతం అంటుంది. మనకు కావాల్సింది ఆస్తి అని, మిగిలిన వాటా కూడా మనకే వచ్చేలా తాత మనసు చెడగొట్టాలని పారిజాతం సలహా ఇస్తుంది. ఆస్తి మొత్తం చేజిక్కుంచుకోవాలని అంటుంది. కార్తీక్‌ను దీపకు వదిలేయాలని పారిజాతం అంటుంది. దీంతో కోపంగా పారిజాతం పీకపట్టుకుంటుంది జ్యోత్స్న. బావ తనకు దక్కలేదంటే నేను చస్తాను, నిన్ను చంపుతానని జ్యోత్స్న అంటుంది. నన్నెందుకు చంపుతావని పారిజాతం అంటే.. దెయ్యమయ్యాకైనా సలహాలు ఇవ్వడానికి నువ్వు నాతో ఉండాలి కదా అని జ్యోత్స్న చెబుతుంది. నేనంటే ఎంతో ప్రేమే అంటూ నవ్వుతుంది పారిజాతం.