Brahmamudi Serial Today November 25th Episode : బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్లో అపర్ణ చాలా సీరియస్‌గా స్పందిస్తుంది. వాడు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు సుభాష్ వెళ్లి మీ అమ్మని తీసుకుని రా అనడంతో ఆ కళావతి రాకముందు వరకు నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు ఇప్పుడు మీ అందరికీ విలన్ లాగా కనిపిస్తున్నానా అని అంటాడు రాజ్.అపర్ణ కాళ్లు పట్టుకుంటావో లేదంటే కావ్య గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుకుంటావో వెళ్లి మీ అమ్మని తీసుకురమ్మని సుభాష్ చెబుతాడు. మమ్మీ మాటలు చూస్తుంటే అర్థం కావట్లేదా డాడ్. నేను చెప్పి వెళ్లి అడిగిన రాదు అని రాజ్ అంటాడు. నీ పెళ్లాం లేకుండా నువ్ ఉంటావేమో నా పెళ్లాం లేకుండా నేనుండలేను అని సుభాష్ అని చెబుతాడు. అయితే నువ్వెళ్లి తీసుకు రా అన్నయ్య. రాజ్‌ను ఎందుకు ఇబ్బంది పెడతావ్ అని రుద్రాణి అంటుంది.
తప్పు చేసింది వాడు అయితే నేనెందుకు వెళ్లాలి. అపర్ణ ఏం చెప్పిందే వినావ్ కదా. వాడిని గారాబం చేసి నేను చెడగొట్టానట. మొండితనం, పొగరుతనం నా వల్ల వచ్చిందని అన్నది అని సుభాష్ అంటాడు. కావ్య వచ్చి సంవత్సరం కాలేదు. తనను ఎందుకుంత నమ్మారు. నన్ను నెత్తిన పెట్టుకున్న చూసుకున్నారు. సడెన్‌గా నేను విలన్ అయ్యానా అని రాజ్ అనడంతో అప్పుడు ఇందిరా దేవి షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. అప్పుడు రాముడులా ఉండేవాడివి. ఇప్పుడు రాక్షసుడిలా మారావ్. పెళ్లాన్ని టార్చర్ పెట్టడమే కాకుండా ఇప్పుడు ఆ లిస్ట్‌లో తల్లిని కూడా చేర్చావ్ అని అంటుంది. ఇక ఇన్ని రోజులు నేను చేసిన ప్లాన్ లు అన్నీ రివర్స్ అయిపోతాయి ఆ కావ్య ఎట్టి పరిస్థితులలో ఇంటికి రాకూడదు అని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి.
తర్వాత రాజ్,కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగా కావ్య పట్టించుకోకపోవడంతో అప్పుడు వాళ్ళిద్దరూ ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు. ఊసరవెల్లి రంగు మారిచినట్టు మీ ఇంట్లో అందరూ రంగులు మారుస్తారు అని అంటారు రాజ్. అత్తయ్య కండిషన్ పెట్టిన కావ్య వస్తుందా. రాజ్ మోసం గురించి తెలిసి ఎందుకొస్తుందని రాహుల్ అంటాడు. అలా రాదు కాబట్టే అక్కడికి వెళ్లి అపర్ణ వదిన డ్రామా ఆడుతుంది. ఆ డ్రామా వర్కౌట్ అయి కావ్య తిరిగి ఇంటికి వస్తే మళ్లీ మొదటికి వస్తుంది. ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి ఆస్తి పంపకాలు చేసేవరకు తీసుకొచ్చాను. ఇప్పుడు కావ్య వస్తే మొత్తం రివర్స్ అవుతుంది. ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి అని రుద్రాణి తెగ భయపడిపోతుంది.
గెలిచినా కూడా తలవంచుకుని వచ్చాను. ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకునేది అని కావ్య అంటుంది. కర్ర పట్టుకుని నడిచే స్థితికి వచ్చిన నేను అర్థం చేసుకోను. మా అమ్మను పంపిస్తావా లేదా అని రాజ్ అంటాడు. ఆమె వస్తానంటే నచ్చజెప్పి తీసుకెళ్లండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కావ్య వెళ్లిపోతుంది. దాంతో చేసేది లేక రాజ్ ఇంట్లోకి వెళ్తాడు. రాజ్ అడుగుపెట్టగానే అపర్ణ కూరగాయలు కోస్తూ, చెమట తుడుచుకుంటూ కనిపిస్తే కనకం దర్జాగా రాణిలా కనిపిస్తుంది. అపర్ణ ఏది అడిగిన మధ్య తరగతి కుటుంబంలో అలా ఉండదంటూ ఇద్దరు డ్రామా చేస్తుంటారు. అదంతా చూసిన రాజ్ షాక్ అయి అరుస్తాడు. అల్లుడు గారు ఎప్పుడు వచ్చారని కనకం అంటే.. మీరు కాలు మీద కాలు వేసుకుని మా అమ్మను బానిసలా చూస్తున్నప్పటి నుంచి వచ్చాను అని రాజ్ అంటాడు. ఏం కర్మ మమ్మీ నీకు. ఎలాంటి స్థితికి నిన్ను తీసుకొచ్చారో. నీకు భయపడే క్యాన్సర్ కనకం నీకే పనులు చెబుతోంది. ఇలాంటి మనుషుల మధ్య ఎందుకు అని రాజ్ అంటాడు.