Karthika Deeapam 2 November 25 Episode : కార్తీక దీపం తాజా ఎపిసోడ్లో మామయ్య సరిగా అర్థం కారని కాశీ భార్య దిల్లు అంటుంది. “మా నాన్న పైకి కనిపించేంత తేలికైన మనిషి కాదు అని దిల్లు అనగా, చాలా లోతైన మనిషి” అని కాశీ అంటాడు. రెస్టారెంట్లో గొడవ సమయంలో కార్తీక్‌ను కొట్టబోతే దీప అడ్డుకున్న విషయాన్ని శివన్నారాయణ మళ్లీ తలుచుకొని అదే విషయాన్నే ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఆయన దగ్గరికి సుమిత్రి వచ్చి బాధపడుతుంది. కార్తీక్‌కు దీపతో పెళ్లయిన దగ్గరి నుంచి రాత్రివేళ కూడా జ్యోత్స్న రూమ్‌లో లైట్ వెలుగుతూనే ఉంటుందని చెబుతుంది జ్యోత్స్నకి త్వరగా వేరే సంబంధం చూసి ఫారిన్‌కు పంపాలని, అలా అయితే ఇక్కడి విషయాలు మర్చిపోతుందని అనుకుంటున్నానని శివన్నారాయణను సుమిత్రి అడుగుతుంది. అయితే జ్యోత్స్న తన ఇష్టం అంటోందని, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాధపడుతుంది.
జ్యోత్స్న ఎప్పుడు ఏం చేస్తుందోనని భయం అని సుమిత్రి అంటే.. తాను ఓ నిర్ణయం తీసుకున్నానని శివన్నారాయణ అంటాడు. ఇక డైనింగ్ టేబుల్ వద్దకు కార్తీక్ వస్తాడు. మిగిలిన వారిని కూడా పిలిస్తే కలిసి తిందామని దీపతో కార్తీక్ అంటాడు. కలిసి భోజనం చేద్దామని కార్తీక్ అడిగితే తర్వాత తింటానని దీప అంటుంది. ఈ మాటతో అనసూయ నొచ్చుకుంటుంది. దీప మనసు మారదా అంటూ శౌర్యతో అనసూయ అంటుంది. నా పుట్టిన రోజున చాలా వంటలు చేసినట్టున్నావ్, అయినా బాగోలేవని దీపతో కార్తీక్ అంటాడు. దీంతో కాంచన, అనసూయ, శౌర్య కూడా ఆశ్చర్యపోతారు. ఏం తగ్గిందని దీప అడిగితే.. ప్రేమ తగ్గిందని కార్తీక్ అంటాడు. ఎవరూ లేనట్టు ఒంటరిగా తినాల్సి వస్తుందని ఫీల్ అవుతాడు.
కార్తీక్, దీప ఇద్దరూ వంటల గురించి, రుచి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో భార్యభర్తలు మాట్లాడుకుంటున్నట్టు లేదని, రెస్టారెంట్ ఓనర్, చెఫ్ మాట్లాడుకుంటున్నట్టు ఉందని కాంచన అంటుంది. కార్తీక్ పుట్టిన రోజున వాళ్లను సంతోషంగా ఉంచాలనుకుంటే.. వాళ్లిద్దరూ కలిసి తమను సంతోషంగా ఉంచుతున్నారని కాంచన అంటుంది. అమ్మానాన్న కలిసి ఉండాలంటే నువ్వో పని చేయాలని శౌర్యకు చెబుతుంది. నువ్వు మీ నాన్నను కార్తీక్ అని పిలవాలని శౌర్యతో కాంచన అంటుంది. దీప చెప్పినట్టుగా అంటుంది. కార్తీక్‌ను కార్తీక్ అని పిలవాలని, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని శౌర్యతో చెబుతుంది. మేడ మీదికి వెళ్లి నడుస్తూ దీపతో కబుర్లు చెప్పొచ్చు కదా అని కార్తీక్‌తో కాంచన అంటుంది.
కార్తీక్‌ను నాన్న అని కాకుండా కార్తీక్ అని శౌర్య పిలుస్తుంది. దీంతో కార్తీక్ అని పిలుస్తుందేంటని దీప ఆశ్చర్యపోతుంది. రేపు నేను స్కూల్‌కు వెళ్లాలి, ఎవరు తీసుకుకెళతారు, అమ్మ తీసుకెళుతుందా కార్తీక్ అని శౌర్య అంటుంది. “దీనికేమైంది.. నాన్న అని పిలువడం మానేసి.. కార్తీక్ అని పిలుస్తుందేంటి. దీప అలా పిలవమందా. దీప ముందు అడిగితే బాగోదులే” అని మనసులో కార్తీక్ అనుకుంటాడు. అమ్మ ఏమో అనసూయను అక్కా అంటోంది. అనసూయ ఏమో చెల్లెమ్మ అంటుంది. ఇదంతా చూస్తుంటే ఏదో సీక్రెట్ మిషన్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరినీ అడగకుండా సైలెంట్‌గా ఏం చేయబోతున్నారో పరిశీలించడం మంచిది” అని మనసులో అనుకుంటాడు కార్తీక్. నలుగురితో బంధాలు కలుపుకొని ముందుకు సాగని పెద్దలు చెప్పిన మాటను పాటిస్తున్నామని, నువ్వు కూడా అలాగే చేయాలని దీపతో అనసూయ అంటుంది. రెండు కుటుంబాలు ఎప్పుడు ఒక్కటవుతాయా అని ఆలోచిస్తున్నా. రేపు ఏదో మీటింగ్ ఉందని కార్తీక్ బాబు చెప్పారు కదా” అని దీప అనుకుంటుంది.