Karthika Deeapam November 26 Episode : కార్తీక దీపం తాజా ఎపిసోడ్లో శివన్నారయణ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. దానికి జ్యోత్స్న రావడంతో కార్తీక్ షాక్ అవుతాడు. చైర్మన్‌గా సంస్థ అభివృద్ధికి తాను ఓ నిర్ణయం తీసుకున్నానని శివన్నారాయణ ప్రకటిస్తాడు. “ఇప్పటి వరకు జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కు కార్తీక్ సీఈవోగా ఉన్నారు. ఈసారి సీఈవోగా నా మనవరాలు జ్యోత్స్నను నియమిస్తున్నాను” అని శివన్నారాయణ చెప్పడంతో కార్తీక్ నొచ్చుకుంటాడు. జ్యోత్స్నను సీఈవోగా నియమించడంపై బోర్డ్ సభ్యులను అభిప్రాయాలు అడగగా, అందరూ దీనికి ఓకే చెబుతారు. కాని కార్తీక్ రాజీనామా లేఖ అందిస్తాడు. సంస్థ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారా అని జ్యోత్స్న అడిగితే.. రాజీనామా లెటర్ అంటే అంతే కదా కొత్త సీఈవో గారు అని వెటకారంగా అంటాడు కార్తీక్.
సంస్థ ఎవరి కోసం ఆగదని, అందరూ గుర్తుంచుకోవాలని చెబుతాడు శివన్నారాయణ. దీంతో పొమ్మని ఇంత సూటిగా చెబుతున్నప్పుడు నేనెందుకు ఉండాలని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇల్లు ఊడుస్తుండగా.. శౌర్యకు చెందిన మందుల చీటి దీపకు దొరుకుతుంది. దీంతో శౌర్యకు ఉన్న ఆరోగ్య సమస్య ఏంటో, ఈ మందులు ఎందుకు వాడతారో తెలుసుకోవాలనుకుంటుంది. ఆ చీటిని కాంచన దగ్గరికి తీసుకెళ్లి.. ఈ మందులు ఎందుకు వాడతారని అనుమానంగా అడుగుతుంది. కార్తీక్ చెప్పినా దీప అనుమానం పోలేదని, శౌర్య గురించి నిజం చెబితే గుండె పట్టుకొని పడతావని మనసులో కాంచన అనుకుంటుంది. జ్వరం తగ్గాక కూడా శరీరంపై ఉంటుందని, మళ్లీ రాకుండా కొన్నాళ్లు మందులు వాాడాల్సి ఉంటుందని కాంచన కవర్ చేస్తుంది.
శౌర్య గురించి కార్తీక్ బాబు నిజం దాచారేమోనని అనవసరం భయపడ్డానని దీప తనలో తానే అనుకుంటుంది. నిజం దాచినందుకు సారీ అని కాంచన కూడా మనసులోనే బాధపడుతుంది.ఇక జ్యోత్స్న మాట్లాడుతూ… తాను సీఈవో అవడం నచ్చలేదా, ఆడదాని కింద పని చేయడానికి ఈగో అడ్డొచ్చిందా అని ప్రశ్నిస్తుంది. అయితే, తాత గురించి ఉండిపో అని, వదిలేసి వెళితే బాధపడారని, అత్తకు పుట్టింటిని దూరం చేసినట్టు అవుతుందని కార్తీక్‌తో జ్యోత్స్న అంటుంది. దీంతో మీ తాతకు నచ్చిందని చేయాలని దీప చెప్పిన మాటను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. ఈ రాజీనామాను తాను అంగీకరించనని, ఆ లెటర్ చించేస్తుంది జ్యోత్స్న. ఎప్పటిలాగే ఈ సంస్థలో కంటిన్యూ కావాలని అంటుంది. దీపకు ఇచ్చిన మాట కోసం కొనసాగుతాను అని అనుకొని.. ఓకే చెబుతాడు కార్తీక్.
అడిగి మరీ కాంగ్రాట్స్ చెప్పించుకొని.. కార్తీక్‌తో షేక్ హ్యాండ్ తీసుకుంటుందని జ్యోత్స్న. ఈ చేతులు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని అనుకుంటుంది. కార్తీక్‌ను సీఈవోగా తీసేశారంటూ స్వీట్లు పంచుతుంది. ఆనందం వ్యక్తం చేస్తుంది. కార్తీక్‌ను సీఈవో పోస్ట్ నుంచి పీకేశారని దిల్లూకు చెబుతుంది పారిజాతం. బావను తీసేయడమేంటని కాశీ అంటాడు. జ్యోత్స్నను ఆ సీఈవో పదవిలో కూర్చొబెట్టారని ఆనందంగా అంటుంది పారిజాతం. “నీ కూతురు సీఈవో అయిందని సంతోషపడక.. దీప మొగుడికి పదవి పోయిందని బాధపడతావేంట్రా” అని దాసుతో పారిజాతం అంటుంది. దాసుకు జ్యోత్స్న కూతురు అనే విషయంపై నోరు జారుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఈ విషయంపై కాశీ ప్రశ్నిస్తాడు.తన అన్న కార్తీక్ తల వంచాడంటే అది గౌరవం అని, చేతకాని తనంకాదని దిల్లు అంటుంది. ఆ తర్వాత ఇంటికి వస్తాడు కార్తీక్. కారు దిగగానే మీటింగ్‌లో ఏమైందని, తాతయ్య ఏమైనా అన్నారా అని దీప అడుగుతుంది. తనను ఘోరంగా అవమానించారని, మాటలతో కాదు చేతలతో చేశారని కార్తీక్ అంటాడు.
తాను ఇప్పటి వరకు సీఈవోగా ఉండే వాడినని, ఇప్పుడు ముఖ్యమైన పోస్ట్ నుంచి తనను తీసేశారని చెబుతాడు. దీంతో దీప, కాంచన షాక్‌కు గురవుతుంది. సీఈవో ఎవరు అని కాంచన అడిగితే.. జ్యోత్స్న అని కార్తీక్ సమాధానం ఇస్తాడు.తాను వద్దాన్నా అప్పుడు సీఈవోను చేశారని, ఇప్పుడు తీసేశారని బాధపడతాడు. అంతా వాళ్ల ఇష్టం ప్రకారం జరుగుతుందని అంటారు. తాత మనసుకు నచ్చిన విధంగా నడుచుకోవాలని ఈ దీప చెప్పింది కదా.. అందుకే అన్నీ ఆలోచించి మౌనంగా వచ్చేశానని అంటాడు.