Brahmamudi Serial Today November 28th Episode : బ్రహ్మముడి తాజా ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కావ్య తన ఇంటికి వెళ్లిపోవడంతో స్వప్న, ఇందిరాదేవీలు వంట చేస్తుండగా, ఇందిరా దేవి చేయి కాలుతుంది. అప్పుడు అది చూసిన రాజ్.. నేను వద్దని చెప్పాను కదా నానమ్మ అనడంతో మీ తాతయ్యకి బయట ఫుడ్డు పడదు అందుకే చేస్తున్నాను అని అంటాడు. ఇంతలో అక్కడికి సుభాష్ రుద్రాణి, ధాన్యలక్ష్మి ముగ్గురు వస్తారు. ఇంట్లో ఇంతమంది ఉన్న వంట చేసే వాళ్ళు లేరా అనడంతో నాకు అసలు వంటే రాదు అని అంటుంది రుద్రాణి. అప్పుడు పిన్ని నువ్వైన సాయం చేయోచ్చు కదా అని రాజ్ అంటే.. నీ భార్య మీ అమ్మ ఉన్నప్పుడు నేను కనపడలేదు నేను అంతమందికి అప్పుడు వంటలు చేసిన ఎవరు నా కష్టాన్ని గుర్తించలేదు ఈరోజు మీకు కష్టం వచ్చేసరికి నేను కనిపించానా,ఇన్ని రోజులు లేని మానవత్వం ఇప్పుడు కనిపించిందా అని అంటుంది ధాన్యలక్ష్మి.
నీ తమ్ముడు కళ్యాణ్ ని ఇంటికి తీసుకురావాలనిపించడం లేదా అంటూ రాజ్ మీ చాలా దారుణంగా మాట్లాడి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. అప్పుడు సుభాష్ చూసావ్ కదా రాజ్ ఆడది లేని ఇల్లు ఎలా ఉంటుందో ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని వెళ్లి మీ మమ్మీని కావ్యని పిలుచుకొని రా అని అంటాడు. అప్పుడు రాజ్ సీరియస్గా కావ్యకి కాల్ చేసి తిన్నావా, మీ అమ్మ తినిందా అనగా మీ అమ్మ కూడా తినింది అంటుంది కావ్య. మీరు బాగా తినండి ఇక్కడ ఇంట్లో ఇంతమంది ఉన్న తాతయ్య,నానమ్మలకు భోజనం చేసి పెట్టేవారు లేరు వారిని చూసుకునే వాళ్ళు లేరు అని అంటాడు రాజ్. ఇందాక నానమ్మ తాతయ్యకు వంట చేస్తూ చేయి కాల్చుకుంది అనడంతో అవునా ఇప్పుడు ఎలా ఉంది అని కావ్య టెన్షన్ గా అడగగా అంత ఓవర్ యాక్షన్ వద్దు అని అంటాడు రాజ్.
మర్యాదగా మా అమ్మని మా ఇంటికి పంపించు అని పెత్తనం చేస్తూ మాట్లాడటంతో వెంటనే అపర్ణ ఏంట్రా ఏదో బాధ్యత గల భర్త భార్య మీద అరిచినట్టు అరుస్తున్నావ్, ఆరోజు ఇంట్లో నుంచి బయటకు పంపించినప్పుడు లేదా. ఇంకొక సారి ఆకలిగా ఉంది,భోజనం లేదు అని కాల్ చేస్తే నేను నిన్ను కొడతాని అని ఫోన్ కట్ చేస్తుంది అపర్ణ. ఇక అప్పు కళ్యాణ్ ని తీసుకొని అనామిక దగ్గరకు వెళ్లగా, అప్పుడు ఏంటి అనామకురాలా అనగా నా పేరు అనామిక అంటుంది. భవిష్యత్తులో నువ్వు అలాగే అవుతావు. నువ్వు నా భర్తని రిజెక్టెడ్ పీస్ అన్నావ్ కదా ఇది చూడు అంటూ చెక్ చూపిస్తుంది. మా ఆయన పాటలు రాసి సంపాదించాడు అనడంతో అనామిక షాక్ అవుతుంది.
మరొకవైపు కావ్య ఇందిరాదేవి, సీతారామయ్య లకు క్యారేజ్ తీసుకొని వెళ్తుండగా అపర్ణ అవసరమా అని అంటుంది. అక్కడ తాతయ్య వాళ్లు భోజనం లేక అల్లాడుత్తున్నారు అని అంటుంది. అయితే ఇప్పుడు నువ్వు వెళ్తే నేను వచ్చిన డానికి అర్థం లేకుండా పోతుంది అంటుంది అపర్ణ. కాని కావ్యని చూసి అపర్ణ సరే అని అంటుంది. ఇక కావ్య బాక్స్ తీసుకొని రాగా, ఈ వంక పెట్టుకుని మా ఇంట్లో ఉందామని వచ్చావా అని అనడంతో కావ్య రాజ్ కి లెఫ్ట్ అండ్ రైట్ పీకుతాడు రాజ్. అప్పుడు మా అమ్మమ్మ తాతయ్యల కోసం క్యారేజీ తెచ్చాను అనడంతో ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. ఏ సంబంధం ఉందని ఇక్కడికి వచ్చావు అనగా మా మనవరాలు ఈ ఇంటి కోడలు ఎవరు కాదంటారు ఏ సన్నాసి కాదంటారు అని అంటుంది ఇందిరాదేవి. కావ్యతో బంధం వద్దనుకుంది నువ్వు మేము కాదు అని అంటాడు సీతారామయ్య.