Gunde Ninda Gudi Gantalu November 28th : గుండె నిండా గుడి గంటలు గత ఎపిసోడ్లో బాలు ఉద్యోగం కోసం ఏజెన్సీల చుట్టూ తిరిగిన ఎవరు జాబ్ ఇవ్వకపోవడం, రోహిణికి తన బాయ్ ప్రెంఢ్ దినేష్ ఫోన్ చేసి గతంలో ఇవ్వాల్సిన 25,000 ప్రస్తుతం 50,000.. మొత్తం 75 వేల రూపాయలను ఇవ్వాలని, లేకపోతే రహస్యం మొత్తం ఇంట్లో వారికి చెప్తానని బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేస్తాడు.ఇక రోహిణి ముందు రోహిణీ ముందు తనని ప్రభావతి అవమానించడం, తన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడటంతో మీనా బాధపడుతోంది. దీంతో ఎలాగైనా డబ్బులు తీసుకురావాలని మీనా తన గాజులను తీసుకెళ్లి తాకట్టు పెట్టాలని అనుకుంటుంది. తన తమ్ముడికి బంగారు గాజులు తెచ్చి డబ్బులు తీసుకరమ్మని చెబుతోంది మీనా.
ఇక తాజా ఎపిసోడ్లో బాలు ఉద్యోగం కోసం తిరుగుతుండగా ఓ వ్యక్తి కనిపించి తమ అపార్ట్మెంట్లో పనిచేయడానికి ఓ వ్యక్తి కావాలని చెబుతాడు. వేరే వ్యక్తి ఎందుకు సార్ తాను ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నానని, తనకు ప్రస్తుతం ఉద్యోగం ఎంతో అవసరమని, ఆ పని నేనే చేస్తానని అంటాడు. అయితే అది డ్రైవింగ్ కాదు, క్లీనర్ పని చెప్పగా దానికి బాలు ఓకే చెబుతాడు. మొత్తానికి డ్రైవర్ బాలు.. కాస్త క్లీనర్ గా పనిలో చేరుతాడు. మరోవైపు మీనా తమ్ముడు శివ తన ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకువచ్చి తన అక్కయ్యకు ఇస్తాడు. మీనా ఆ డబ్బులు తీసుకువచ్చి తన అత్తగారికి ఇస్తోంది. అయితే.. ఈ విషయం బాలుకి తెలియదు. బాలు ఇంట్లోకి రాగానే ఇంటి సరుకులు వస్తాయి. వాటికి డబ్బులు రేపు ఇస్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు. ‘ఆల్రెడీ నీ పెళ్ళాం డబ్బులు ఇచ్చేసింది కదా.. నువ్వు రేపు ఇస్తానని చెబుతున్నావని ప్రశ్నిస్తుంది ప్రభావతి.
బాలు డబ్బులు ఇవ్వకుండా.. డబ్బు ఎక్కడి నుండి తీసుకొచ్చావని ప్రశ్నిస్తుంది. ‘మీ తమ్ముడు లాగా.. దొంగతనం చేసి తీసుకొచ్చావా?’ అంటూ నిందిస్తుంది. తనకు దొంగతనం చేసే అంత కర్మ పట్టలేదని, కావాలనుకుంటే పస్తులు ఉంటానని అంటుంది. డబ్బులు ఇవ్వలేదన్న విషయం నిజమే.. కానీ, కారు ఈఎంఐకి ఇచ్చిన డబ్బులు సరుకులకు ఇచ్చినట్లు ఉందని కవరింగ్ చేస్తాడు బాలు. ఆయన దొంగతనం చేసిన వారిని ఇంట్లో పెట్టుకుని తన భార్యను ఎందుకు తిడతారని, తాను మనోజ్ పై కేసు పెడితే.. జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ప్రభావతి మొఖం చిన్నబోతుంది. ఆ తర్వాత బాలు బెడ్ రూమ్ కి వెళ్ళిపోతాడు. మీనా రాగానే డబ్బులు ఎక్కడి నుండి తీసుకొచ్చావని అడుగుతాడు. మీరు నెల ఇచ్చిన డబ్బులను కూడ పెడుతున్నానని, అలాగే పూలు అమ్మగా వచ్చిన డబ్బులు దాచిపెట్టానని మీనా చెప్పుకొస్తుంది.
ఇక ఆ విషయంలో కాస్త డౌట్ పడిన బాలు .. మీనా చేతికి గాజులు లేకపోవడం గమనిస్తాడు. అప్పుడు ఆమెని గట్టిగా అడుగుతాడు. దాంతో మీనా నిజం ఒప్పుకుంటుంది. ఇంట్లో వాళ్ళు మిమ్మల్నీ తిడితే భరించలేకపోయానని అందుకే తన గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావాల్సి వచ్చిందని చెబుతోంది. అప్పుడు బాలు కాస్త రియలైజ్ అవుతాడు. మరోసారి ఇలాంటి పనులు చేయకనీ, తనకు ఒక దగ్గర డ్రైవర్ గా పని దొరికిందని, వచ్చే నెల జీతం రాగానే డబ్బులు ఇస్తానని చెబుతాడు. దీంతో మీనా సంతోషపడుతుంది. కానీ బాలు మాత్రం టెన్షన్ పడతాడు. తాను డ్రైవర్ గా కాకుండా క్లీనర్ గా చేస్తున్నానంటే బాధపడుతుందని చెప్పకుండా ఊరుకుంటాడు.
మరోవైపు రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడగడానికి ప్రయత్నిస్తోంది. కానీ, మనోజ్ ముందుగానే తన బిజినెస్ ఐడియా గురించి రోహిణికీ చెప్పుకొస్తాడు. ఒకసారి తన తండ్రితో మాట్లాడి.. డబ్బులు అడగమని, బిజినెస్ పెట్టుకుంటే.. లైఫ్ సెట్ అయిపోతుందని రిక్వెస్ట్ చేస్తాడు. ఎలాగైనా ఆ మ్యాటర్ ను డైవర్ట్ చేయాలని రోహిణి.. మీ కోసం ఓ సర్ఫ్రైజ్ గిఫ్టు తీసుకవచ్చాననీ, సెంట్ బాటిల్ ఇచ్చి ఆ ఇష్యూని డైవర్ట్ చేస్తుంది. దాంతో మనోజ్ విషయం మరిచిపోతాడు. మరోవైపు బాలు తెల్లారగానే లేచి జాబుకు వెళ్లాలని కంగారు కంగారుగా రెడీ అవుతాడు. మీనా మాత్రం ఏదో ఊహాల్లో విహరిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తర్వాతి ఎపిసోడ్లో తెలుస్తుంది.