Gunde Ninda Gudi Gantalu November 29th : గుండె నిండా గుడి గంటలు గత ఎపిసోడ్లో బాలు క్లీనర్ జాబ్ చేసేందుకు సిద్ధమవ్వడం మనం చూశాం. ఇక మీనా తమ్ముడు శివ డబ్బులు తీసుకువచ్చి తన అక్కయ్యకు ఇస్తాడు. ఆ డబ్బులను తీసుకువచ్చి తన అత్తగారికి ఇస్తే దొంగతనం చేసి తీసుకొచ్చావా అంటూ మీనాని నిందిస్తుంది. తనకు దొంగతనం చేసే అంత కర్మ పట్టలేదని, పైసలు లేకపోతే.. పస్తులు ఉంటానని అంటుంది. ఇక బాలు కూడా ఆ డబ్బులు ఎక్కడివి అని అడిగితే ఏదో స్టోరీ చెబుతుంది. అయితే చేతులకు గాజులు లేకపోవడానికి చూసి.. గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకవచ్చావా? అని మీనాను నిలదీస్తాడు. చివరికి మీనా నిజం ఒప్పుకుంటుంది. ఇక బాలు తెల్లారి జాబ్‌కి వెళ్లేందుకు రెడీ అవుతాడు.
తాజా ఎపిసోడ్లో ప్రభావతికి మీనాక్షి ఫోన్ చేసి రవి గురించి ఏం ఆలోచించావని కోడింగ్ భాషలో అడుగుతుంది. తాను కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నానని, కానీ ఆ విషయం ఆలోచిస్తేనే భయమేస్తుందని, అటు బాలు ఇటు సత్యం ఏమంటారో.. వారి రియాక్ట్ ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయంగా ఉందనీ ఫీల్ అయితుంది ప్రభావతి. ఈ రోజే రవిని వెళ్లి కలవమని సలహా ఇస్తుంది. దీంతో ప్రభావతి తోడుగా రమ్మని కామాక్షిని రిక్వెస్ట్ చేస్తుంది. దీనికి ముందుగా రాలేదని చెప్పినా ప్రభావతి రిక్వెస్ట్ చేయడంతో తర్వాత వస్తానని హామీ ఇస్తుంది కామాక్షి. ఇక బాలు అపార్ట్మెంట్లో డ్రైవర్‌గా కాకుండా క్లీనర్‌గా చేస్తున్నాడని మీనా ఫ్రెండ్ చెబుతుంది.
అప్పుడు బాలు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని మీనా బాలు పని చేసే ప్లేస్‌కి వెళుతుంది. అక్కడికి వెళ్లేసరికి బాలు కార్లను క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే ఓ కారు ఓనర్ వచ్చి తన కారులో ఫోను కనిపించడం లేదని, ఫోన్ తీసావా? అంటూ బాలుని నిలదీస్తాడు. తాను చూడలేదని తనకు తీయాల్సిన అవసరం లేదని, అంటాడు. మరో వ్యక్తి వచ్చి ఏమైందని ప్రశ్నించగా.. తనకు ఫోన్ కనిపించడం లేదని, కానీ తన ఫోన్ ను కారులోనే పెట్టానని, కారు కీస్ బాలుకు మాత్రమే ఇచ్చానని చెబుతాడు.ముక్కుమొఖం తెలియని వారిని పనిలో పెట్టుకోవద్దనీ, ఎవరు ఆ వ్యక్తిని పనిలో పెట్టారంటూ రెచ్చిపోతాడు. బాలుపై దొంగతనం చేశాడంటూ నింద వేస్తాడు.
ఆ కారు ఓనర్ బాలుని చెక్ చేయడానికి ప్రయత్నించాడు. తన ఒంటిపై చేయి వేస్తే బాగోదని చెబుతాడు బాలు. ఇంతలోనే మరో వ్యక్తి వచ్చి ఫోన్ గ్రౌండ్ లోనే మరిచిపోయారని తీసుకవచ్చి ఇస్తాడు. దీంతో అప్పటి వరకూ రెచ్చిపోయిన వ్యక్తి అక్కడి నుంచి సైలెంట్ గా జారుకుంటాడు. అతను కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్లినందుకు బాలు బాధపడతాడు. ఇక బాలు కష్టాన్ని చూసి మీనా ఏడ్చుకుంటూ వెళుతుంది. మరోవైపు శృతి, రవిల లైఫ్ చాలా హ్యాపీగా నడుస్తుంటుంది. అప్పుడు శృతికి ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి.. కొత్త కాపురం ఎలా ఉందని అడుగుతుంది. ఏం కొత్త కాపురం.. అంతా రొటీన్ గా ఉండదంటుంది శృతి. అప్పుడు హనీమూన్ కి ప్లాన్ చేసుకోమని ఫ్రెండ్ సలహా ఇవ్వడంతో రవిని శృతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ రవి మాత్రం ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే అంటుంది.