Aishwarya Rai : ఇటీవలి కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. కొందరు భామలు సోషల్ మీడియాలో భర్త ఇంటి పేరు తొలగించడంతో అభిమానులకి క్లారిటీ వచ్చేస్తుంది. గతంలో సమంత తన సోషల్ మీడియా పేజ్‌లో అక్కినేని అనే పేరు తొలగించి సమంత రూత్ ప్రభు అని పెట్టుకుంది. అప్పుడు అందరు సమంత- నాగ చైతన్య విడిపోతున్నారని అనుకున్నారు. చివరికి అదే నిజమైంది. ఇక గత కొద్ది రోజులుగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ నెట్టింట అనేక ప్రచారాలు సాగుతున్నాయి. తాజాగా ఓ ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ పేరు పక్కన బచ్చన్ లేకపోవడంతో విడాకులు నిజమేనని జోస్యాలు చెబుతున్నారు.
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, అందాల తార ఐశ్వర్యరాయ్ పలు చిత్రాల్లో నటించి ఆ తర్వాత 2007లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ‘ఆరాధ్య’ అనే కూతురు కూడా ఉంది. గత 16 ఏండ్లుగా వీరు తమ వైవాహిక బంధాని సాఫీగా సాగిస్తున్నారు. కాని ఇటీవల వీరి మధ్య మనస్పర్థాలు తలెత్తాయనీ, వీరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయనీ, త్వరలో అభిషేక్- ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. పలు ఈవెంట్స్ లో ఐశ్వర్యరాయ్ ఒంటరిగా కనిపిస్తూనే ఉన్నది.ముఖ్యంగా తన భర్త లేకుండా కేవలం కూతురుతోనే ఎన్నో రకాల షోలకు ఫంక్షన్లకు వెళుతూ ఉన్నారు. ఇటీవల అనంత అంబానీ పెళ్లి వేడుకలలో కూడా ఐశ్వర్యరాయ్ కేవలం ఒక్కరే రావడంతో ఈ రూమర్లు మరింత బలాన్ని ఇచ్చింది.
ఇక ఇదిలా ఉంటే దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఉమెన్ ఫోరమ్ ఈవెంట్లో ఐశ్వర్యరాయ్ పాల్గొనగా, ఆ సమయంలో నటి లైమ్‌లైట్‌లో మెరిసిశారు. ఈ కార్యక్రమంలోవేదికపై కూడా ఐశ్వర్య కనిపించింది. ఈ అమ్మడు వేదికపైకి వచ్చిన వెంటనే.. బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద స్క్రీన్‌పై “ఐశ్వర్య రాయ్, ఇంటర్నేషనల్ స్టార్” డిప్లే లో వేశారు. ఐశ్వర్య రాయ్ పేరు ప్రదర్శించడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కాకపోతే అక్కడ ఐశ్వర్య పేరులో ‘బచ్చన్’ అనే ఇంటిపేరు కనిపించకపోవడంతో మరోసారి వారి విడాకుల ఇష్యూ తెరపైకి వచ్చింది. దీనిపై ఐష్ కాని, అభిషేక్ కాని స్పందిస్తారా అనేది చూడాలి.