సాధారణంగా చాలా మంది ఉదయం ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ చేస్తుంటారు. అయితే ఉదయం పూట వీటితోపాటు ఆరోగ్యవంతమైన ఆహారాలను కూడా తీసుకోవాలి. దీంతో మన శరీరానికి కావల్సిన పోషకాల్లో అధిక మొత్తంలో పోషకాలు ఉదయం ఆహారంతోనే లభిస్తాయి. దీని వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారు. ఇమ్యూనిటీ సైతం పెరుగుతుంది. అలాగే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసట అనేది ఉండదు. కనుక ఉదయం ఆరోగ్యవంతమైన ఫుడ్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక హెల్తీ ఫుడ్స్ విషయానికి వస్తే వాటిల్లో బాదంపప్పు మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. బాదంపప్పును ఉదయం తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
రాత్రిపూట గుప్పెడు బాదంపప్పును నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బాదంపప్పును పొట్టు తీసి తినాలి. ఇలా రోజూ తినడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. బాదంపప్పును తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. 100 గ్రాముల బాదంపప్పు ద్వారా సుమారుగా 21.15 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బాదంపప్పును ఉదయం తీసుకోవడం వల్ల కండరాలకు మరమ్మత్తు జరుగుతుంది. దీంతో కండరాలు దృఢంగా మారుతాయి. అలాగే ఉదయం బాదంపప్పును తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో చిరుతిండి తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు ఉదయం బాదంపప్పును తింటే ఎంతో మేలు జరుగుతుంది.
100 గ్రాముల బాదంపప్పును తినడం వల్ల సుమారుగా 49.42 గ్రాముల మేర ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు. ఇవి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) లెవల్స్‌ను పెంచుతాయి. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాదంపప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల బాదంపప్పు ద్వారా సుమారుగా 12.5 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో రోజూ సుఖ విరేచనం అవుతుంది. ఫలితంగా మలబద్దకం నుంచి విముక్తి పొందవచ్చు. నానబెట్టిన బాదంపప్పును పొట్టు తీసి తింటే సులభంగా జీర్ణమవుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ సైతం కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఇలా బాదంపప్పును నానబెట్టి ఉదయం తింటే రోజంతా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
100 గ్రాముల బాదంపప్పులో సుమారుగా 25.63 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీని వల్ల చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. వయస్సు మీద పడడాన్ని తగ్గిస్తుంది. చర్మంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. చర్మం తేమగా ఉంటుంది. చర్మంలో కాంతి పెరుగుతుంది. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. 100 గ్రాముల బాదంపప్పు ద్వారా సుమారుగా 268 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. ఇది మెదడు, నాడుల పనితీరును మెరుగు పరుస్తుంది. మెగ్నిషియం వల్ల కండరాలు ప్రశాంతంగా మారుతాయి. కండరాలపై పడే ఒత్తిడి తగ్గుతుంది. దీంతోపాటు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్లేవనాయడ్స్ జాబితాకు చెందుతాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వాపులను తగ్గిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బాదంపప్పులో ఫైబర్, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో హైబీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
100 గ్రాముల బాదంపప్పును తినడం వల్ల సుమారుగా 579 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువును అదుపులో ఉంచుకునేందుకు సహాయ పడుతుంది. అధికంగా బరువు ఉన్నవారు రోజూ బాదంపప్పును తినాలి. 100 గ్రాముల బాదంపప్పులో సుమారుగా 0.3 మిల్లీగ్రాముల మేర రైబోఫ్లేవిన్, 1.14 మిల్లీగ్రాముల మేర నియాసిన్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతాయి. దీంతో చిన్నారులకు ఎంతగానో మేలు జరుగుతుంది. వారు చదువుల్లో రాణిస్తారు. అలాగే పెద్దల్లో మతిమరుపు సమస్య తగ్గుతుంది. ఇలా నానబెట్టిన బాదంపప్పును పొట్టు తీసి రోజూ ఉదయం తినడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక రోజూ వీటని తినడం మరిచిపోకండి.