Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. అప్పటి మాదిరిగా పెద్ద హిట్స్ కొట్టకపోయిన వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నారు.చిరంజీవి ప్రస్తుతం మరో యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’’ సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ సినిమా చేస్తాడు అని అందరిలో అనేక అనుమానాలు నెలకొని ఉండగా, ఇప్పుడొక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి తమ సినిమాల్ని చూస్తూ పెరిగిన యువతరం దర్శకులు చెబుతున్న కథలు చిరంజీవికి బాగా నచ్చడంతో వారితోనే సినిమాలు చేస్తున్నాడు.
తమ అభిమాన హీరోను తెరపై ఎలా చూపించాలనుకుంటున్నారో అలా చూపించి మంచి రిజల్ట్ రాబడుతున్నారు. అయితే చిరంజీవిని ఇప్పటికే అయిదారుగురు మార్కెట్ ఉన్న దర్శకులు కలిసినప్పటికీ స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కాని నాని దసరాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకు చిరు ఆమోదం తెలిపినట్టు ఫిలిం నగర్ టాక్.వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినిదత్ నిర్మిస్తారని టాక్. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ అంతర్గతంగా అంగీకారం జరిగిందని సమాచారం. శ్రీకాంత్ ఓదెల చిరుకి వీరాభిమాని. ఎంతగా ఆంటే మెగాస్టార్ పుట్టినరోజు ట్వీట్లు, ఇంటర్వ్యూలు చూస్తే అర్థమైపోతుంది.
దసరా ఓపెనింగ్ సీన్ లో వచ్చే కల్లు కాంపౌండ్ ఎపిసోడ్ టీవీలో చూపించేది చిరంజీవి పాటే. పలు చోట్ల రిఫరెన్సులు వాడుతూనే వచ్చాడు. అంత ఫ్యానిజం ఉన్న శ్రీకాంత్ ఓదెల నిజంగా తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఏ స్థాయిలో ఎలివేట్ చేస్తాడా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. శ్రీకాంత్ ఓదెల చెప్పిన ఒక లైన్ బ్రహ్మాండంగా నచ్చి డెవలప్ చేయమని చెప్పారట. మాస్ టేకింగ్ తో కొత్తగా ఆలోచించే శ్రీకాంత్ ఎలాంటి స్టోరీ రాసుకున్నాడో వేచి చూడాలి.