ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కి సంబంధించి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 526 ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రూప్-బి నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో ఎస్ఐ, గ్రూప్-సీ నాన్- గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. . అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://itbpolice.nic.in/ వెబ్సైట్ చూడొచ్చు. అయితే ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య: 526.
సబ్-ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) పోస్టులు – పురుషులు: 78, సబ్-ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) పోస్టులు – మహిళలు: 14, హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పోస్టులు – పురుషులు: 325, హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పోస్టులు – మహిళలు: 58, కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పోస్టులు – పురుషులు: 44, కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పోస్టులు – మహిళలు: 07గా ఉన్నాయి. ఎస్ఐ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్లు.. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ఐ పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400.. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100.. కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
విద్యార్హత చూస్తే..ఎస్ఐ పోస్టులకు బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/ మ్యాథ్స్/ ఐటీ/ సీఎస్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్) లేదా బీసీఏ లేదా బీఈ, బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సీఎస్/ ఎలక్ట్రికల్/ ఐటీ).. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) లేదా ఐటీఐ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్)/ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రికల్); కానిస్టేబుల్ పోస్టులకు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్ఐ పోస్టులకు రూ.200.. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులకు రూ.100.. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: నవంబర్ 15, 2024 కాగా, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 14, 2024.