Sukumar : ఇప్పుడు దేశ వ్యాప్తంగా పుష్ప2 గురించే చర్చ నడుస్తుంది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ మూవీ గత రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ కార్యక్రమంలో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. సుకుమార్ మాటలకి ఏకంగా రష్మిక, బన్నీలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. చిత్ర దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ… “నేను బన్నీని ఆర్య నుండి చూస్తున్నాను. తను ఎలా ఎదుగుతున్నాడు చూస్తూనే వచ్చాను. తనని వ్యక్తిగా, ఒక ఆర్టిస్టుగా చూసాను. ఈ పుష్ప అనే సినిమా ఇలా వచ్చింది అంటే దానికి కారణం కేవలం నాకు బండికి ఉన్న ఒక బాండింగ్ కారణంగానే. బన్నీ ఒక సీన్ కోసమో లేదా ఒక సాంగ్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా చాలా కష్టపడతాడు అని సుక్కూ అన్నారు.
కేవలం నీ మీద ప్రేమతోనే ఈ సినిమా నేను తీశాను. నీతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు నా దగ్గర పూర్తి కథ లేదు. నువ్వు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేసినందుకు నీకోసం నేను ఏమైనా చేసేయొచ్చు అనిపించింది. మిగతావారు అంతా చెప్పినట్లు బన్నీ సెట్స్ లో అందర్నీ కలిపి ఒక స్థాయిలోకి తీసుకుని వెళ్లి కూర్చోబెడతాడు. దానితో అందరికీ అదే స్థాయిలో పనిచేయాలని అనిపిస్తుంది. చిత్రం కోసం సెట్స్ లో కష్టపడి పనిచేసిన రష్మిక, డిఓపి అందరికీ ధన్యవాదములు. రష్మిక గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. తను ప్రతి ఎక్స్ప్రెషన్ ఇంకా ఎమోషన్‌ను చాలా బాగా క్యారీ చేసింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కి ధన్యవాదాలు. క్లైమాక్స్ లో ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సినిమా ఎంతో హై ఉండబోతుంది. శ్రీలీల డాన్స్ మూవ్స్ చాలా బాగా చేసింది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడ్డారు” అంటూ ముగించారు. అయితే సుక్కూ అంతలా మాట్లాడే సరికి ఎమోషనల్ అయ్యారు బన్నీ, రష్మిక.
ఇక బన్నీ అయితే సినిమాకి పని చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. టెక్నీషియన్లు, నటీనటులు, నిర్మాతల గురించి ప్రస్తావించాడు. ముఖ్యంగా క్యూబా, దేవిశ్రీ ప్రసాద్, రవి శంకర్, నవీన్ యెర్నేనిలతో పాటు చెర్రీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. రష్మిక మీద పొగడ్తల వర్షం కురిపించాడు. రెండు రోజులు వరసగా నిద్ర లేకుండా పీలింగ్స్ పాట కోసం కష్టపడటం చూశానని, ప్రొఫెషనలిజం ఉంటే తప్ప అంత అంకిత భావం ఉండదని, అయిదు సంవత్సరాలు కలిసి పని చేయడం గురించి జ్ఞాపకాలు పంచుకున్నాడు.