Brahmamudi Serial December 4th Episode : బ్రహ్మముడి సీరియల్లో కావ్య తన ఇంటికి వెళ్లిపోవడంతో రాజ్ కుటుంబ సభ్యులు అందరు ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు రాజ్, కావ్యని కలపాలని అపర్ణ, కనకం ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో అపర్ణ తన భర్తకి విడాకుల నోటీసులు కూడా పంపిస్తూ ఉంటుంది. అయితే గత ఎపిసోడ్లో మరో విడాకుల నోటీసు పంపింది అపర్ణ. దాంతో మా ఇంటి నుంచి వెళ్లిపోండి అని అపర్ణ ముఖం మీద కావ్య చెబుతుంది. అది కాదే అని కనకం అడ్డపడుతుండగా నువ్వు మధ్యలో మాట్లాడకు క్యాన్సర్ కనకం అని తిడుతుంది కావ్య. నీ కూతురు నన్ను ఇంట్లో నుంచి మెడపట్టి గెంటేలా ఉంది అనడంతో ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది అని అంటుంది కనకం.
మీరు విడాకులు ఇవ్వడానికి కారణం నేనే అని మీ అబ్బాయి అనుకుంటున్నాడు అత్తయ్య అనడంతో వాని సంగతి నేను చూసుకుంటాను అని అంటుంది అపర్ణ. మరోవైపు రాజ్ ఆవేశంతో కావ్యకి పేపర్స్ ఇవ్వడానికి వస్తాడు. ఆ పేపర్స్ ఏంటి అనడంతో విడాకుల పేపర్లు శాశ్వతంగా ఈ కళావతని దూరం చేసుకోవాలనుకుంటున్నాను అని అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు అపర్ణ రాజ్ ని కొట్టబోతుంది. నువ్వు చేసిన పని నేను చేశాను అని అడుగుజాడల్లోడ నేను నడుస్తున్నాను మమ్మీ దాంట్లో తప్పేముంది అని ఆవేశంగా చెబుతాడు. ఏ పేపర్స్‌తో నన్ను బెదిరించాలని చూశావో అదే పేపర్స్ అడ్డుపెట్టుకొని మిమ్మ్ని ఆడించాలని వచ్ఆను అని రాజ్ అంటాడు.
నాతో వెంటనే వచ్చేయ్ లేదంటే ఆ కళావతినిజీవితంలో క్షమించను అని అంటాడు రాజ్. విడాకుల పేపర్లు కావ్య చేతిలో పెట్టి సారీ కళావతి ఇది నాకు మా అమ్మకు జరుగుతున్న యుద్ధం అని చెప్పి వెళ్ళబోతుండగా సీతారామయ్య అక్కడికి వచ్చి రాజ్ చెంప చెల్లుమనిపిస్తాడు. ఎవరికి ఇస్తున్నావ్ రా సమయం అంటూ సీతారామయ్య రాజు మీద గరం గరం అవుతాడు. మీ అమ్మకి సమయం ఇస్తావా.. ఎందుకు రా ఇలా దిగజారిపోతున్నావ్ అంటూ మాట్లాడతాడు. నా వంశంలో నీలాంటి బ్రష్టుడు పుడతాడని కలలో కూడా ఊహించలేదు అని అంటాడు. కావ్య ని ఎందుకు వద్దనుకుంటున్నావో ఒక్క కారణం చెప్పు అనడంతో తలదించుకుంటాడు రాజ్.
కావ్యని పిలుచుకొని వచ్చి దాని కళ్ల లోకి నేరుగా చూసి చెప్పు అది ఏం పాపం చేసింది ఏం ద్రోహం చేసింది
చెప్పమని ఇందిరా దేవి అంటుంది. ఆ నాడు కావ్యని నీకు ఇచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోసాను. ఇంత పురుష అహంకారం ఏ మాత్రం పనికి రాదు, కావ్య నాకు దేవుడ ఇచ్చిన మనవరాలు, ఇంటి వారసురాలు అనడంతో ఒక్కసారిగా రాజ్ షాక్‌లో ఉండిపోతాడు. కూతురి కాపురాన్ని నిలబెట్టినందుకు ఇందిరా దేవి సీతారామయ్యల గురించి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతారు కనకం దంపతులు. ఆ ఇంటికి వెళ్దాం రా కావ్య అనడంతో ఆ మనిషి మనసులో ప్రేమ లేనప్పుడు ఎలా రావాలి అని అంటుంది. వాడి మనసులో ప్రేమ లేకపోతే మేమే దగ్గర ఉండి నీకు రెండో పెళ్లి చేసేవాళ్లం తల్లి అంటాడు సీతారామయ్య. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే మా ఇల్లు చీకటి అయిపోవడమే కాదు, కుటుంబం ముక్కలైపోతుంది సంసారం నాశనం అవుతుంది అని అంటుంది. నా మనవడు తరఫున నేను నీ కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడుగుతాను అని సీతారామయ్య అనడంతో , వస్తాను తాతయ్య మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తితో ఆ ఇంటి కోడలుగా మళ్లీ అడుగు పెడతాను అనడంతో అందరూ సంతోషపడతారు.