BEL EAT Recruitment 2024 : దేశ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఇందుకు గడువు విధించారు. ఈ పోస్టులకు గాను ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐఈ, ఇంజినీరింగ్ డిప్లొమా చదివిన వారు అర్హులు. అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ కోర్సు ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. ఈ పోస్టులకు గాను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://bel-india.in/ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఖాళీలు 47 ఉండగా, టెక్నిషియన్ సి ఖాళీలు 37 ఉన్నాయి. మొత్తం 84 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. అభ్యర్థులకు వయస్సు 01.11.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఇంజినీరింగ్ పోస్టులకు నెలకు రూ.24,500 నుంచి రూ.90వేల వరకు వేతనం ఇస్తారు. టెక్నిషియన్ పోస్టులకు నెలకు రూ.21,500 నుంచి రూ.82వేల వరకు ఇస్తారు.
అభ్యర్థులు రూ.295 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.