Tollywood Hero : ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఇటు హీరోలు అటు హీరోయిన్స్ సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ రోజు నాగ చైతన్య పెళ్లి కానుండగా, వచ్చే ఏడాది అఖిల్ వివాహం చేసుకోబోతున్నాడు. కీర్తి సురేష్ పెళ్లి కూడా మరి కొద్ది రోజులలో జరగనుంది. వీరితో పాటు ఇంకొంత మంది భామలు కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా హీరోగా పరిచయమయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి గురించి కూడా ఇప్పుడు నెట్టింట ఓ ప్రచారం నడుస్తుంది. ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ అడపాదడపా విజయాలు అందుకుంటున్న శ్రీనివాస్ తెలుగులో చివరిసారిగా 2021లో అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ చేసినా డిజాస్టర్ అయింది. అయితే శ్రీనివాస్ చేతిలో మాత్రం చాలా సినిమాలు ఉన్నాయి. త్వరలో భైరవం సినిమాతో పలకరించబోతున్నాడు. ఆ తర్వాత టైసన్ నాయుడు సినిమాతో రాబోతున్నాడు. అవి కాకుండా మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, ఒకప్పటి స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. మా పెద్దబ్బాయి లైఫ్ సెట్ అయిపోయింది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఏప్రిల్ లో నేను ఇంకో సినిమా మొదలుపెడతాను. శ్రీనివాస్ పెళ్లి వచ్చే సంవత్సరమే ఉండొచ్చు.
అతని పెళ్లి అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. త్వరలో దాని గురించి చెప్తాము. చిన్న అబ్బాయి కెరీర్ లో ఇంకా సెట్ అవ్వాలి. ఆ తర్వాతే పెళ్లి చేస్తాను అని తెలిపారు. మరి ఈ హీరో చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీకి చెందినదా, లేదంటే వారికి తెలిసిన అమ్మాయా అనేది తెలియాల్సి ఉంది. సురేష్ నిర్మాతగా బాగానే రాణించిన ఇద్దరు కుమారులు హీరోగా సక్సెస్ కాలేకపోతున్నారు. చిన్న కుమారుడికి కూడా సక్సెస్ రేటు పెద్దగా లేదు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ జాతకం పెళ్లి తర్వాత ఏమైన మారుతుందా అనేది చూడాలి.