కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 110 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్, లీగల్, హెచ్ఆర్, ఇంజినీరింగ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను డిసెంబర్ 19వ తేదీ వరకు గడువు విధించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 5వ తేదీన ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పనిచేయాలి. ఇతర సౌకర్యాలతోపాఉ నెలకు రూ.85వేల వరకు వేతనం ఇస్తారు. మరిన్ని వివరాలకు గాను అభ్యర్థులు https://www.gicre.in/en/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
జనరల్ విభాగంలో 10 పోస్టులు ఖాళీగా ఉండగా లీగల్ 9, హెచ్ఆర్ 6, ఇంజినీరింగ్ 5, ఐటీ 22, యాక్చురీ 10, ఇన్సూరెన్స్ 20, మెడికల్ (ఎంబీబీఎస్) 2, ఫైనాన్స్ పోస్టులు 18 ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్, సీఎఫ్ఏ, సీఏ, సీఎంఏ, ఎంకామ్, పీజీ, ఎల్ఎల్ఎం ఉత్తీర్ణతతోపాటు ఇతర నైపుణ్యాలను కలిగి ఉండాలి. 01.01.2025 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో విభాగాల వారిగా సడలింపులు ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు పైన ఇచ్చిన లింక్‌ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.