Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు తాజా ఎపిసోడ్లో బాలు కోసం ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాలని సత్యం ఫిక్సవుతాడు. కానీ బాలు కోసం ఇంటి పత్రాలు తాకట్టు పెట్టడానికి ప్రభావతి ఒప్పుకోదు. మనోజ్, రోహిణి కోసం తనకు చెప్పకుండా ప్రభావతి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టిన సంగతిని సత్యం గుర్తుచేయడంతో ప్రభావతి సెలైంట్ అయిపోతుంది. ఇక బాలును నిద్రలేపడానికి ప్రయత్నించి అతడిపై పడిపోతుంది మీనా. ఏయ్ పూలగంప నువ్వా…ఏం చేస్తున్నావని బాలు కంగారుగా మీనాను అడుగుతాడు. మీ కళ్లలో నలక పడుతుందేమో నాలుకతో తీద్దామని ఎదురుచూస్తున్నానని రొమాంటిక్‌గా మీనా సమాధానం చెప్పుకు రాగా, అప్పుడు బాలు.. నలక కాదు కదా ఎలక పడ్డ నీతో మాత్రం తీయించుకోనని అంటాడు.
ఇక మనోజ్ ఇంట్లోనే గేమ్స్ ఆడుతూ ఉండడంతో అతను జాబ్ మానేశాడని మౌనిక డౌట్ పడుతుంది. ఈ క్రమంలో ఆఫీస్‌కు ఎందుకు వెళ్లలేదని అడుగుతుంది. మనోజ్‌కు ఒంట్లో బాగాలేదని అతడి బదులు ప్రభావతి సమాధానం చెబుతుంది.. ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం ఒంట్లో బాగాలేకపోవడమా అని మౌనిక సెటైర్లు వేస్తుంది. ఆ తర్వాత బాలుకు మీనా టిఫిన్ వడ్డిస్తుంటుంది. మొత్తం వాడికే తోడిపెట్టకు తర్వాత తినేవాళ్లు ఉన్నారని ప్రభావతి అనడంతో బాలు మనస్సు నొచ్చుకుంటుంది.. తినేటప్పుడు ఏం మాటలు అంటూ అత్తపై మీనా ఫైర్ అవుతుంది. అది అర్థం చేసుకునేవాళ్లకు చెప్పొచ్చు. మా అమ్మకు కాదు అని బాలు, మీనాలకు మౌనిక సపోర్ట్ చేస్తుంది.
నా జోలికి వస్తే బాగుండదని తల్లికి మౌనిక వార్నింగ్ ఇస్తుంది. ఏదన్న అంటే పడటానికి తాను మీనాను కాదని, అన్ని దులిపేసుకొని వెళ్లే నీ పెద్ద కొడుకును కాదని హెచ్చరిస్తుంది.ఇక రోహిణి ఏదో సీరియస్‌గా రాయడం చూసి ఏం రాస్తున్నావని ప్రభావతి అడుగుతుంది. అత్త భజన అని కొత్తగా కనిపెట్టిందని బాలు పంచ్‌లు వేస్తాడు. ఇంట్లో నువ్వు, మనోజ్ కష్టపడి సంపాదిస్తుంటే తిని కూర్చునేవాళ్లు పెరిగిపోతున్నారని బాలు, మీనాలపై తన మనసులో ఉన్నదంతా ప్రభావతి బయటపెడుతుంది. అయితే మెతుకు మెతుక్కి లెక్కలు కట్టే ఈ తల్లి ఎలా మాట్లాడుతుందో నాకు తెలుంటూ బాలు చెబుతాడు.
కార్లకు ఉన్న మురికిని కడిగేయచ్చు…కానీ ఇలాంటి నోర్లకు ఉన్న మురికి కడిగేయడం కష్టం అని బాలు అంటాడు. ఇక సత్యం గణపతి దగ్గరకి వెళ్లి డబ్బులు ఇచ్చేసి కారును ఇంటికి తీసుకొస్తాడు . కారు కీస్‌ను మీనా చేతుల మీదుగా బాలుకు ఇప్పిస్తాడు. మీనా వల్లే కారు తిరిగి తన సొంతం కావడంతో బాలు ఆనందం వ్యక్తం చేస్తాడు. ఇక ఫైనాన్షియర్‌ని మీనా కలిసిందని ఆ సమయంలో అనవసరంగా తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తానని బాలు అనుకొని మీనాకి సారీ చెబుతాడు. మీనాకు సారీ చెప్పే విషయంలో తన స్నేహితుడిని మీడియేటర్‌గా ఉండమని బతిమిలాడుతాడు బాలు. ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకొండి మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయద్దని బాలుతో ఫ్రెండ్ అంటాడు. చివరికి ఫ్రెండ్‌తోనే చెప్పించగా, అప్పుడు తిట్టినప్పుడు కొట్టినప్పుడు లేని రోషం…పౌరుషం సారీ చెప్పడానికి వచ్చిందా అని మీనా అంటుంది. ఇక మీనాను తీసుకెళ్లి కారు ముందు సీటులో కూర్చోబెడతాడు బాలు. కళ్లు మూసుకోమని చెబుతాడు. ఆమె చేతికి గాజులు తొడుగుతాడు. ఆ గాజులు చూసి మురిసిపోతుంది మీనా.