Brahmamudi Serial Today December 7th : బ్రహ్మముడి తాజా ఎపిసోడ్లో కావ్యతో మాట్లాడిన తర్వాత సీతారామయ్య కోమాలోకి వెళ్లిపోతాడు.ఆ విషయం తెలుసుకొని అందరు ఏడ్చేస్తుంటారు. కోమా నుంచి బయటకు వస్తే తప్ప చెప్పలేం అని డాకర్లు చెప్పేసరికి ఫ్యామిలీ అంతా కన్నీరు మున్నీరు అవుతుంటారు. ఆ సమయంలో ఇందిరా దేవిని కావ్య ఓదారుస్తూ ఉంటుంది.. తాతయ్య ఆరోగ్యంగా తిరిగి వస్తారు.. మీరు ఏం భయపడకండి.. ఇంటికి వెళదాం పదండి అంటే ఆమె రాను అని చెప్పగా, కావ్య సర్ధి చెబుతుంది.
అయితే అక్కడే ఉన్న రాహుల్, రుద్రాణిలు ఆయనకేమైన పాతికేళ్లా ఇంకా బ్రతకడానికి, వీళ్ల ఓవర్ యాక్షన్ కాకపోతే అని అంటారు.మరోవైపు కనకం మూర్తితో మాట్లాడుతూ.. అక్కడ ధాన్యలక్ష్మి డ్రామాల వల్ల తాతయ్య గారు కోమాలోకి వెళ్లిపోయారట.. తప్పు చేసింది ధాన్యలక్ష్మి అయితే ఆ తప్పు ఎక్కడ కావ్యపై పడుతుందో అని భయంగా ఉందంటూ కనకం మూర్తితో అటుంది.
మరోవైపు తాతయ్య ఫోటో పట్టుకొని.. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను బావ అని కన్నీళ్లు పెడుతున్న అమ్మమ్మను ఓదార్చి.. కావ్య ఆమెను భోజనం తినేందుకు కిందకు తీసుకొని వస్తుంది..ఎంటి అమ్మమ్మ గారు మీరిలా బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్లు అందరూ ధైర్యంగా ఎలా ఉంటారు చెప్పండి అని కావ్య అంటుంది. అప్పుడు ఇందిరాదేవి.. చెట్టంత మనిషి ఆ నాలుగు గోడల మధ్య ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉంటే నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు కావ్య.
ఇక ఇందిరా దేవి తిందామని అనుకుంటున్న సమయంలో రుద్రాణి మళ్లీ గోల చెయ్యడం మొదలు పెడుతుంది.. ధాన్యలక్ష్మి చచ్చిపోయే వరకు వచ్చింది అయినా ఆస్థి పంచరా? అని అడుగుతుంది. అప్పుడు బుద్దుందా లేదా అని కావ్య తిడుతుంది.. నీకు పుట్టింట్లో గతి లేక ఇక్కడకు వచ్చి పడ్డావ్ అని అనడంతో నా కోడలును అనే అర్హత నీకు లేదు అంటూ సీరియస్ అవుతుంది అపర్ణ. ఇక అక్కడే ఉన్న స్వప్న కూడా ఫుల్ సీరియస్ అవుతుంది.
మా పుట్టింటి గురించి ఊరికే అంటారు. అసలు మీకు పుట్టిల్లు ఉందా ? ఉంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు.. అంటే మీ పుట్టిల్లు కనీసం మిమ్మల్ని పిలవను కూడా పిలవదా ? అని తిడుతుంది.. తను మాట్లాడింది నిజమే కదా ధాన్యలక్ష్మి.. నా తమ్ముడుని ఎప్పుడైనా మీ పుట్టింటి వాళ్ళు అల్లుడు అని తీసుకెళ్లి గౌరవం ఇచ్చారా? అని సుభాష్ అడుగుతాడు.. ఇంతటితో తాజా ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్లో సీతారమయ్య ఆరోగ్యం గురించి తెలుస్తుందా, లేదంటే ఇంకా లాగుతారా అనేది చూడాలి.