Naga Babu : మెగా బ్రదర్‌గా నాగబాబుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నటుడిగా,నిర్మాతగా, రాజకీయనాయకుడిగా నాగబాబుకి మంచి పేరు ఉంది. అయితే ఈ మధ్య రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు నాగబాబు. ఆయన చేసే కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ మధ్య ఇన్‌డైరెక్ట్‌గా బన్నీపై కామెంట్స్ చేశాడు. మెగా ఫ్యామిలీ కూడా బన్నీని అసహ్యించుకుంటూ పుష్ప2 రిలీజ్ అడ్డుకోవాలని ప్రయత్నం చేసింది. కాని నాగబాబు తన సోషల్ మీడియా ద్వారా 24 క్రాఫ్ట్‌ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా.. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. అందరిని అలరించే సినిమాని సినిమాలానే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను.. అని నాగబాబు ట్వీట్ వేశాడు.
ఇక ఇదిలా ఉంటే ఇటీవల ఒక సీనియర్ నటి నాగబాబు మంచి మనసు గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు వ్యాంప్ తరహా పాత్రల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత నాగబాబు గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనకి చాలా మంది అండగా నిలిచినవాళ్లు ఉన్నారు కానీ ఆర్థికంగా సహాయం చేసింది మాత్రం నాగబాబు అని జయలలిత తెలిపారు. 2017 నుంచి నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కాగా, ఆ సమయంలో నాగబాబు చాలా సహాయం చేశారు. కష్టాల నుంచి నన్ను గట్టెక్కించారు. పరుచూరి గోపాల కృష్ణ లాంటి వారి కూడా నాకు సపోర్ట్ గా నిలిచారు అని పేర్కొంది.
అయితే నాగబాబు మాత్రమే నాకు ఆత్మీయుడిలా అనిపిస్తారు. ఆయన డబ్బు ఇస్తే మొహమాటం లేకుండా తీసుకుంటాను. ఆయన్ని నేను ప్రేమగా బావా అని పిలుస్తాను అంటూ జయలలిత క్రేజీ కామెంట్స్ చేసింది. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు జయ రా కాఫీ తాగి వేళ్ళు అని పిలుస్తారు. వెళ్లే ముందు కవర్ లో డబ్బు పెట్టి ఇస్తారు అంటూ జయలలిత నాగబాబు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంది. నాగబాబు డబ్బు ఇస్తే నా మనిషి నాకు ఇచ్చాడు అనే ఫీలింగ్ ఉంటుంది అంటూ జయలలిత తెలిపారు. ఆమె చివరిగా మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో నటించింది.