Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు ఈ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. ఒకప్పుడు సినిమా హీరోగా పవన్‌ని ప్రశంసించిన వారు ఇప్పుడు ఆయనని నాయకుడిగా కూడా పొగిడేస్తున్నారు. సొంత పార్టీ నేతలే కాకుండా ప్రత్యర్ధ పార్టీలకి సంబంధించిన వారు కూడా పవన్‌ని పొగడడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన ముఖ్య నేతగా ఉంటూ ప్రస్తుతం ఎంపీ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ కు అంతలా మద్దతు తెలుపుతూ మాట్లాడిన మాటలు వెనక ఆంతర్యం ఏమిటి, ఆయన అలా ఎందుకు ఎక్స్ లో పోస్ట్ చేశారు, ప్రస్తుతం దానిపై చర్చ సాగుతుంది.
మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఇటీవల పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవటంపై పవన్ కళ్యాణ్ గురించి పేర్ని నాని ప్రశంసలు కురిపించారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యలలో ప్రశంసలతో పాటుగా సెటైర్లు కూడా ఉన్నాయి. తన శాఖ కాకపోయినప్పటికీ ప్రాణాలకు తెగించి రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవటం అభినందనీయమంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించారు.. ఇలా పవన్ కళ్యాణ్‌ని ప్రత్యర్ధులు కూడా మెచ్చుకుంటుండడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ నేడు కడప కార్పొరేషన్ హైస్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పవన్ కళ్యాణ్. అయితే ఈ పర్యటన నుంచి ఓ ఫొటో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ కు అక్కడి ఓ పోలీస్ జాగీలం స్వాగతం పలికింది. పవన్ కళ్యాణ్ కు ఆ కుక్క షేక్ హ్యాండ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఆ శునకానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. క్యూట్ ఫొటో అని డాగ్ లవర్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ ఫొటో తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు