Allu Arjun : అల్లు అర్జున్ గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తున్నారు. ఆయన మెగా ఫ్యాన్స్కి వ్యతిరేఖంగా మాట్లాడుతూ మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. తాజాగా పుష్ప2 ప్రీమియర్ షోకి హాజరై ఓ యువతి మృతికి కారణమయ్యాడంటూ చాలా మంది మండిపడుతున్నారు. సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి అల్లు అర్జున్ రాగా.. ఫ్యాన్స్ ఎగబడటంతో రేవతి అనే ఓ అభిమాని చనిపోయింది. దీనిపై రెండు రోజుల తర్వాత స్పందించిన అల్లు అర్జున్.. ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో కనీసం క్షమాపణ చెప్పలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ఇప్పుడు ఎండగడుతోంది. ఏదేదో మాట్లాడు కానీ సారీ మాత్రం చెప్పవా అంటూ అతన్ని నిలదీస్తోంది.
సానుభూతి ప్రకటించడం వరకూ ఓకే కానీ.. క్షమాపణ చెప్పకపోవడం తనను షాక్ కు గురి చేసిందని ఓ యూజర్ కామెంట్ చేయడం చర్చనీయాంశం అయింది. నువ్వు మూవీని ప్రమోట్ చేసే హుడీ, మేకప్, లైటింగ్ అంతా సెట్ చేసుకొని రావడం, చివరికి క్షమాపణ కూడా చెప్పకపోవడం ఏంటని మరో యూజర్ నిలదీశారు.మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేయాలని అనిపించలేదని, తమ టీమ్ అంతా బాధగా ఉందని కూడా అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అయితే దానికి ప్రతి స్పందనగా కేక్ కట్ చేశారు.. బాణసంచా కాల్చారు.. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదని చెబుతారంటూ ప్రశ్నించారు.
రూ.25 లక్షలు అనేది చాలా తక్కువ మొత్తం అని, అందులోనూ సారీ కూడా చెప్పలేదని ఇంకో యూజర్ అన్నారు. రికార్డులు తాత్కాలికం.. క్యారెక్టర్ శాశ్వతం.. ఘటన జరిగిన వెంటనే ఎందుకు స్పందించలేదు.. కేసు పెట్టిన తర్వాతగానీ నీ టీమ్ ను హాస్పిటల్ కు పంపించలేదు.. అసలు నీకు అభిమానులంటే లెక్క లేదు అంటూ అల్లు అర్జున్ని తిట్టిపోస్తున్నారు. అల్లు అర్జున్ 3 నిమిషాల 47 సెకన్ల వీడియో రిలీజ్ చేసినా.. అందులో ఒక్కచోట కూడా ఈ ఘటనపై పశ్చాతాపం చెందినట్టు కనిపించలేదని, క్షమాపణలు కూడా చెప్పలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు