భారత అత్యున్నత న్యాయస్థానంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 107 కోర్టు మాస్టర్ (షార్ట్ హ్యాండ్) (గ్రూప్ ఎ గెజిటెడ్), సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్ బి), పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్ బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. డిసెంబర్ 25ను ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. టైపింగ్ టెస్ట్, రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు గాను అభ్యర్థులు https://www.sci.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఈ నియామక ప్రక్రియలో మొత్తం 107 ఖాళీలను భర్తీ చేస్తారు. కోర్టు మాస్టర్ (షార్ట్ హ్యాండ్)(గ్రూప్ ఎ గెజిటెడ్) పోస్టులు 31 ఉండగా, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్ బి) పోస్టులు 33, పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్ బి) పోస్టులు 43 ఖాళీగా ఉన్నాయి. కోర్టు మాస్టర్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే డిగ్రీతోపాటు 120 డబ్ల్యూపీఎంతో ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ స్పీడ్ః, 40 డబ్ల్యూపీఎం కంప్యూటర్ టైపింట్ స్పీడ్ కలిగి ఉండాలి.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణతతోపాటు 110 డబ్ల్యూపీఎం షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్, 40 డబ్ల్యూపీఎం కంప్యూటర్ టైపింగ్ స్పీడ్‌లో అర్హత ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణతతోపాటు 100 డబ్ల్యూపీఎం షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్ స్పీడ్, 40 డబ్ల్యూపీఎం కంప్యూటర్ టైపింగ్ స్పీడ్‌ను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయో పరిమితి కోర్టు మాస్టర్‌కు 30 నుంచి 45 ఏళ్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాలి. అదే రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులు అయితే రూ.250 చెల్లిస్తే చాలు.
కోర్టు మాస్టర్ పోస్టుకు నెలకు రూ.67,700, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.47,600, పర్సనల్ అసిస్టెంట్‌కు రూ.44,900 జీతంగా చెల్లిస్తారు. మొత్తం 23 ప్రధాన నగరాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.