Pushpa 3 : సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఆర్య, ఆర్య2, పుష్ప, పుష్ప2 చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీని ఆర్య సినిమాతో హీరోగా నిలబెట్టాడు సుకుమార్. ఇక పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్‌గా మార్చేశాడు. పుష్ప2 చిత్రంతో అయితే బన్నీ క్రేజ్ ఎల్లలు దాటింది. దేశ విదేశాలలో బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది. అయితే పుష్ప 2 పెద్ద విజయం సాధించడంతో పుష్ప3 కూడా వస్తుందని అందరు అనుకుంటున్నారు. పుష్ప2 చివరలో కూడా హింట్ ఇచ్చారు దర్శకుడు. అయితే పాన్ ఇండియా లెవెల్లో మాత్రం పార్ట్ 2 వరకే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నాయి. సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో పార్ట్ 3 మాత్రం ఇంకా ఏ సినిమా నుంచి అఫీషియల్ గా ప్రకటించింది లేదు.
కానీ పుష్ప కి మాత్రం పార్ట్ 3 ఉంటుందని చాలానే మాటలు డైరెక్ట్‌గా చిత్ర యూనిట్ నుంచే మొదలైంది. పుష్ప పార్ట్ 1 కి పుష్ప ది రైజ్, పార్ట్ 2 కి ది రూల్ అని ఇక లేటెస్ట్ గా మూడో భాగానికి అయితే “పుష్ప 3 ది ర్యాంపేజ్” అనే క్రేజీ టైటిల్ ని ఇపుడు లాక్ చేసారు.సినిమా ఎండింగ్లో ఈ టైటిల్ వేశారు.పుష్ప 2 క్లైమాక్స్‌లో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉండబోతున్నందని సుకుమార్ హింట్ ఇచ్చేశాడు. పార్ట్ 3లో జగపతిబాబు మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నట్లు అర్ధమవుతుంది. పుష్పపై పగతో రగిలిపోతున్న ప్రతాపరెడ్డి, జాలీరెడ్డి, మంగళం శీను, దాక్షాయణితో పాటు మిగిలిన విలన్స్ గ్యాంగ్ అంతా ఒక్కటైనట్టు చూపించారు. సీఎం సిద్ధప్ప కూడా పుష్పరాజ్ కి దూరం కాగా,ఆయన ఒక్కడు విలన్ గ్యాంగ్‌తో ఎలా పోరాడాడు అని పార్ట్3లో చూపించనున్నట్టు తెలుస్తుంది.
పుష్ప 3 రావడానికి మరో 6 సంవత్సరాల కంటే ఎక్కువ సమయమే పడుతుంది అంటున్నారు. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఒప్పుకున్న పలు సినిమాలు ఉన్నాయట. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక సినిమా అనౌన్స్ చేసాడు. అలాగే సందీప్ రెడ్డి వంగతో కూడా ఓ సినిమా ఉంది. అట్లీతో కూడా ఓ సినిమా ఉందని టాక్ ఉంది. అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా పూర్తి చెయ్యాల్సిన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయట. సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. అందుకే పుష్ప కి కాస్త బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట మేకర్స్. మరి చూడాలి పుష్ప3ని ఎప్పుడుసెట్స్ పైకి తీసుకెళతారో..!