Pushpa 2 : ఫుష్పరాజ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పుష్ప 1కి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2 ది రూల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.600 కోట్ల వసూళ్లను రాబట్టి పలు రికార్డులని తన ఖాతాలో వేసుకుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలు కొడుతుందా అంటూ ఇండస్ట్రీ, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ. 620 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 12 వేల స్క్రీన్ లలో రిలీజ్ అయ్యింది.
ఐదు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 203 కోట్ల గ్రాస్.. రూ. 140 కోట్ల షేర్ సాధించింది పుష్ప 2. నైజాంలో రూ.62 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 15.10 కోట్లు, ఈస్ట్‌లో రూ.8.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 6.79 కోట్లు, గుంటూరులో రూ. 11.14 కోట్లు, కృష్ణాలో రూ.8.91 కోట్లు, నెల్లూరులో రూ.5.05 కోట్ల చొప్పున వసూల్ చేసింది పుష్ప 2 చిత్రం. వరల్డ్ వైడ్‌గా ఐదో రోజు పుష్ప 2 రూ. 80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి పుష్ప 2 రూ.821 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.. ఇప్పుడు మరో 150 కోట్లు పెరినట్లు తెలుస్తుంది. అంటే దాదాపు 1000 దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాకి పెద్ద హీరోల నుండి ప్రశంసలు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఈ మధ్యకాలంలో చిన్న సినిమా గా వచ్చి పెద్ద హిట్ అందుకున్న సినిమాలకి మహేష్ బాబు, మెగా స్టార్ చిరు వంటి స్టార్స్ అభినందనలు తెలియజేశారు. ఇక పాన్ ఇండియా గా వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ , కల్కి, యానిమల్ మూవీలకు కూడా సెలబ్రేటిస్ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ మోతాదులో ప్రశంసలు దక్కాయి. కాని సుక్కు, అల్లు మూడేళ్ళ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని, వారి విషయంలో టాలీవుడ్ ఎందుకో మూగబోయిందే అనిపిస్తుంది. ఎవరు కూడా పెద్దగా స్పందించడం లేదనిపిస్తుంది. అందుకు కారణం ఏంటా అని ప్రతి ఒక్కరు విశ్లేషణలు చేస్తున్నారు.