Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు యాంకరింగ్‌తో కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత నటిగా మారింది. సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించారు అనసూయ భరద్వాజ్. అనంతరం ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్ని హోస్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అనసూయకి ఈ కార్యక్రమం దశ తిప్పింది. నాగబాబు, రోజా వంటి స్టార్లు స్టేజ్‌పై జడ్జిలుగా ఉన్నప్పటికీ.. అనసూయ కూడా తన హవా చూపించారు. జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు హోస్ట్‌గా చేసే అవకాశాలను దక్కించుకున్నారు అనసూయ.
రంగమ్మత్తగా రంగస్థలంలో అద్భుతంగా నటించిన అనసూయ ఆ తర్వాత పుష్ప చిత్రంతో దాక్షాయణిగా మారింది. రంగస్థలం తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి, ఎఫ్2, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, ఖిలాడీ, విమానం, పెద్దకాపు, రజాకార్ వంటి సినిమాల్లో అనసూయ నటించింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి తన గ్లామర్ షోతో భారీ హైప్ తీసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప పార్ట్ 1, పార్ట్ 2లలో ద్రాక్షాయణిగా నెగిటివ్ రోల్లో నటించి మెప్పించారు అనసూయ. ఇక అనసూయ పర్సనల్ లైఫ్ తో ప్రొఫెషనల్ లైఫ్‌ని బాగానే ఎంజాయ్ చేస్తుంది. ఆమె తన భర్త పిల్లలతో కలిసి సరదాగా చక్కర్లు కొడుతుంటుంది.
అనసూయకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. అనసూయ తండ్రికి ముగ్గురూ ఆడపిల్లలే. దాంతో ఫస్ట్ అబ్బాయి పుట్టాలని గట్టిగా కోరుకుందట. అయితే రెండోసారి అమ్మాయి కావాలని అనుకుందట. కానీ మళ్ళీ అబ్బాయి పుట్టడంతో ఒకింత నిరాశ చెందిందట. అయితే కూతురు కోసం మరోసారి తల్లి కావడానికి సిద్ధం అంటుంది అనసూయ. 40 ఏళ్ళు వచ్చినా పర్లేదు. అమ్మాయిని కనేందుకు ఇప్పటికి కూడా తల్లిని కావాలని ఉందని ఆమె అంటున్నారు. అనసూయ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక బుల్లితెరపై అడపాదడపా కనిపిస్తున్న అనసూయ… నటిగా రాణిస్తుంది. రీసెంట్ గా అనసూయ పుష్ప2 చిత్రంలో కనిపించి అలరించింది. ఇందులో దాక్షాయణిగా అదరగొట్టింది.