ప్రముఖ కార్పొరేట్ కంపెనీ జస్ట్ డయల్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జస్ట్ డయల్ కంపెనీలో మొత్తం 27 బిజినెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. కనీస వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. ఫ్రెషర్లకు కూడా ఉద్యోగావకాశం కల్పిస్తున్నారు. కానీ పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేతనం చెల్లిస్తారు. అర్హలు పనితీరును బట్టి జీతం ఇంకా ఎక్కువగానే పొందే చాన్స్ ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. కేటాయించిన ప్రాంతంలో వ్యాపార సంస్థలను గుర్తించడం, వారి డేటాను సేకరించడం చేయాలి.
రోజువారీ, వారం వారి, నెలవారి విక్రయ లక్ష్యాలను చేరుకోవాలి. జస్ట్ డయల్ ప్రయోజనాలను వివరించాలి. ఇందుకు ప్రజెంటేషన్లను ఉపయోగించాలి. జస్ట్ డయల్ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయాలి. టీమ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దరఖాస్తు ఫీజు లేదు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. మరిన్ని వివరాలకు https://www.justdial.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అభ్యర్థులను డాక్యుమెంట్ల వెరిఫికేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.