Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ పుల్గా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న బ్రహ్మముడి సీరియల్ స్టార్ కావ్య అలియాస్ దీపికాని బిగ్ బాస్‌లోకి పంపారు. ఆమె వచ్చి తెగ సందడి చేసింది. ఆమె చేసిన సందడికి అందరు షాక్ అయ్యారు. ఉన్నంత సేపు బిగ్ బాస్‌తో పాటు ఇంటి సభ్యులతో కలిసి తెగ సందడి చేసింది. బిగ్ బాస్ అంటే క్రష్ అని.. ఐలవ్ యూ చెప్పడంతో పాటు.. కాస్త రొమాంటిక్ గా మాట్లాడవచ్చుకదా అంటూ సెటైర్లు వేసింది..కావ్య మీరు కన్ఫెషన్ రూమ్ కి రండి అని పిలవగా.. కావ్య మాత్రం సంతోషంలో బిగ్ బాస్ నన్ను రూమ్ కి పిలిచాడు అంటూ గట్టిగా అరుస్తూ.. గెంతుతుంది. వెంటనే అవినాష్ మాట్లాడుతూ.. కావ్య అది రూమ్ కాదు కన్ఫెషన్ రూమ్ అంటూ ఆమె తెలుగు తప్పును సరి చేసే ప్రయత్నం చేస్తారు.
ఆ తర్వాత నిఖిల్ ఆమెను కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లారు. బయటకి వచ్చాక అందరితో కూర్చొని ముచ్చట పెట్టింది దీపిక. ఈ సందర్భంగా గౌతమ్‌పై ఓ డైలాగ్ వేసింది. ఒక అమ్మాయితో ఫ్యూచర్లో నీకు పెళ్లి అవుతుంది.. పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదు.. అప్పుడు ఏం చేస్తావ్.. తనని అక్కా అని పిలిచి వచ్చేస్తావా అంటూ దీపిక అడిగి తెగ నవ్వేసుకుంది. దీనికి గౌతమ్ నవ్వుతూ కవర్ చేశాడు. కావ్య మీరుండే సమయం పూర్తయింది.. ఇక బయలుదేరండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఎక్కడైనా గెస్టు వస్తే వాళ్లు పని ఉందని వెళ్లాలి.. ఇలా పిలచి పొమ్మాంటారా అంటూ డైలాగ్ వేసింది కావ్య. దీంతో వామ్మో అలా అనకూడదు అంటూ హౌస్మేట్స్ దండం పెట్టేశారు.
మొత్తానికి కావ్య వేసిన పంచ్‌లు మాత్రం తెగ నవ్వించేసాయి. ఇక పలు టాస్క్‌లు కూడా ఆడించాడు బిగ్ బాస్. బిగ్ బాస్ టీమ్ నుంచి అవినాశ్ విన్ అవ్వడంతో ప్రైజ్ మని పెరుగుతుంది. ఇక చాలామంది దీనికి సబంధించి మాటల మాట్లాడుతున్నారు. ఇక కావ్య అతికష్ట మీద బయటకు వెళ్లింది. ఇక కాస్త గ్యాప్ ఇచ్చి మామగారు సీరియల్ స్టార్ సుహాసిని వచ్చారు. మామగారిసిరియల్ ప్రమోషన్స్ లో భాగంగా వచ్చారు. ఇక అందరు తెలిసిన వాళ్ళు కావడంతో అందరితో చాలా క్లోజ్ గా మూవ్ కావడంతో అందరితో చాలా సరదాగా మూవ్ అయింది. అవినాష్‌ని ఆడుకుంది. ఇక ఫైనల్స్ కు దగ్గరవుతున్న కోద్ది ఆడియస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. టైటిల్ రేస్ లో నిఖిల్, గౌతమ్ లో ఎవరైఒకే అంటున్నారు మరికొందరు లేడీ ప్యాన్స్. ఇక గౌతమ్ తన కాలేజ్ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పాడు. కాలేజ్ లో ఉన్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నా. నా ఫస్ట్ లవ్ స్టోరీ, రిలేషన్ షిప్ అదే. కొన్ని కారణాల వల్ల నా ఫస్ట్ లవ్ సక్సెస్ కాలేదని గౌతమ్ అన్నాడు