Manchu Manoj : గత మూడు నాలుగు రోజులుగా ఎవరి నోట విన్నా కూడా మనోజ్,మోహన్ బాబు గొడవనే వినిపిస్తుంది. సెలబ్రిటీలు అయి ఉండి సామరస్యంగా పరిష్కరించుకోకుండా రోడ్డెక్కారు. దీంతో ఇది రచ్చగా మారింది. మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవి కాగా వారి సంతానంలో మంచు లక్ష్మీ, మంచు విష్ణు జన్మించారు. వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నిర్మలా దేవి చనిపోవడంతో నిర్మలా దేవి చెల్లెలు విద్యాదేవిని వివాహమాడాడు మోహన్ బాబు. వారికి పుట్టిన కుమారుడే మనోజ్. ముగ్గురు పిల్లలు చిన్నతనం నుంచి ఒక తల్లి దగ్గర పెరగడంతో ఎవరు మనోజ్ ను సవతి కొడుకుగా చూడలేదు. అయితే మనోజ్ కు మొదట ప్రణతితో మోహన్ బాబు పెళ్లి చేశాడు. కానీ, ఈ బంధం ఎంతోకాలం నిలబడలేదు. విడాకులు ఇచ్చేశాడు. అక్కడి నుంచే మనోజ్ కు మోహన్ బాబు కు మధ్య గొడవలు మొదలయ్యాయి.
మనోజ్.. భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు. ఆమెను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు ఫ్యామిలీకి అస్సలు నచ్చలేదు. తాము ప్రేమలో ఉన్నప్పుడు మనోజ్ ఫ్యామిలీ.. చాలా సీరియస్ అయ్యారని, చంపడానికి కూడా ప్రయత్నించారని, తాము పారిపోయి ఏడాది మొత్తం రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నామని మనోజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మౌనికని వివాహం చేసుకున్న కారణంగానే మోహన్ బాబు.. మనోజ్‌ని దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు భార్య మాటలు విని మనోజ్ తాగుడుకు బానిస అయ్యాడని మోహన్ బాబు చెప్పుకు రావడం సంచలనంగా మారింది. అయితే అంత బానిస అయ్యేవరకు మోహన్ బాబు ఏం చేస్తున్నాడు, తల్లి కూడా మనోజ్ ను ఆపేలేకపోయిందా.. ? అనే అనుమానాలు వస్తున్నాయి.
మొదటి నుంచి మనోజ్ కు తల్లి నిర్మలకు మధ్య మంచి అనుబంధం ఉండగా, తల్లి మనోజ్‌ని కంట్రోల్ చేయలేకపోయిందా, ఇప్పుడు మనోజ్ విషయంలో దిగులు చెంది ఆయన తల్లి ఆసుపత్రి పాలైందా అనే అనుమానం కలుగుతుంది. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు తన భార్యను కూడా మందలించినట్లు తెలుస్తోంది. నీ వల్లే మనోజ్‌ని ఇంట్లోకి రానిచ్చాను అని మోహన్ బాబు తన భార్యపై కోపం ప్రదర్శించగా.. నా తల్లినే తిడతావా అంటూ తండ్రితో మనోజ్ గొడవ పడినట్లుగా తెలుస్తోంది. తండ్రీ తనయుల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. రానున్న రోజులలో ఇది ఎలా చల్లారుతుందో చూడాలి.