Siddharth : బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పలకరించిన సిద్ధార్థ్ ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దానా వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. అయితే ఈ మధ్యలో సిద్ధార్థ్ అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి సరైన విజయం సాధించడం లేదు. దీంతో అతను వివాదాలతో వార్తలలో నిలుస్తున్నాడు. . రీసెంట్ గా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ పుష్ప 2 సినిమాకు బీహార్ లో అదే పాట్నాలో జరిగిన ఈవెంట్ కు వచ్చిన క్రౌడ్ గురించి మాట్లాడాడు. పుష్ప2 పాట్నా ఈవెంట్ గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ.. మన దగ్గర ఏదైనా కన్ స్ట్రక్షన్ వర్క్ దగ్గర జేసీబీ సౌండ్ వినిపిస్తేనే జనం ఒకచోట గుమిగూడతారని, మన దేశంలో జన సమీకరణ పెద్ద విషయం కాదని జనం వస్తేనే సక్సెస్ అంటే ప్రతి పొలిటికల్ పార్టీ మీటింగ్ లో చాలా మంది జనం వస్తారని చెప్పుకొస్తాడు.
పొలిటీషియన్స్ సభలందరికి వచ్చిన జనాలు చూసి గెలుస్తారనుకోవడం పొరపాటే అని అన్నాడు. బీరు బిర్యాని వల్లే జనాలు రాజకీయ సభలకు వస్తారని మనం మాట్లాడుకుంటామని అన్నారు. మన దేశంలో జనం గుముగూడటం ఒక సాధారణ విషయమని అన్నారు. జనం రావడం సిద్ధార్థ్ అన్నట్టుగా కామనే అయినా అవి కలెక్షన్స్ రూపంలో మారాలంటే మాత్రం అది పుష్ప 2 అయ్యుండాలని అతని మీద రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సిద్ధార్థ్ చేసే కామెంట్స్ ఒక్కోసారి ఆడియన్స్ కి రుచించవు. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 చేస్తున్న సంచలనాలు చూసి కూడా సిద్ధార్థ్ ఈ కామెంట్స్ చేయడం అతని అమాయకత్వాన్ని తెలియచేస్తుందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిస్ యు సినిమాను పుష్ప 2 కి వన్ వీక్ బిఫోర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా వారం తర్వాత పుష్ప 2 వస్తుంది దాని గురించి మీ స్పందన ఏంటని సిద్ధార్థ్ ని అడిగితే నా సినిమా వల్ల పుష్ప 2 భయపడాలి కానీ తనకేం లేదంటూ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు.. తీరా చూస్తే పుష్ప 2 వైబ్ చూసి సినిమా రిలీజ్ వాయిదా వేసుకోక తప్పలేదు. మరి మైక్ పట్టుకుంటేనో.. ఏదో మీడియా అటెన్షన్ ను లాగేసుకోవాలనో సిద్దార్థ్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాడని పలువురు ముచ్చటించుకుంటున్నారు.