Amitabh Bachchan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు సినిమాలు,షోస్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్‌ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయి సినిమాలలోకి వచ్చారు. ఇప్పుడు బిగ్ బీ ఒక భాషకే పరిమితం కాకుండా పలు భాషలలో సినిమాలు చేస్తున్నారు.ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టెలివిజన్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో బిగ్ బీ, తన సతీమణి జయా బచ్చన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె కాల్ చేస్తే తాను ఎందుకు టెన్షన్ పడతారో చెప్పారు. ఇంట్లో రిలేటివ్స్ ఉన్నా, ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా జయ వాళ్లతో బెంగాలీలోనే మాట్లాడుతుంది.
ఆమె ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా పక్కన ఎవరైనా ఉంటే ఆ భాషలోనే మాట్లాడుతుంది. నాకేమో ఆ భాష అర్థం కాదు. కానీ నేను అర్థమైనట్టు నటిస్తాను.. ఇప్పటికీ నేను బెంగాలీ మాట్లాడటానికి కష్టపడతాను. నాకు ఎక్కువగా ఆ భాష తెలీదు. కొంచెం కొంచెం మాత్రమే అర్ధం అవుతుంది అని అమితాబ్ అన్నారు. ఇక తన ఫ్యామిలీ గురించి కూడా చెప్పుకొచ్చిన బిగ్ బీ.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నేను బెంగాలీ మహిళను పెళ్లి చేసుకున్నాను. నా సోదరుడు సింధీ మహిళను, నా కూతురు పంజాబీ అబ్బాయిని, నా కుమారుడు (అభిషేక్ బచ్చన్) మంగళూరు అమ్మాయిని (ఐశ్వర్యా రాయ్) చేసుకున్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన వారు మన ఫ్యామిలీలో ఉండాలని మా నాన్న చెబుతూ ఉంటారని చెప్పుకొచ్చారు బిగ్ బీ.
ఇక అదే షోలో హీరో హృతిక్ రోషన్‌పై అమితాబ్ ప్రశంసలు కురిపించారు. హృతిక్ మొదటి సినిమా రిలీజ్ రోజు, స్నేహితులతో కలిసి థియేటర్ వెళ్లి చూశానని, ఆ తర్వాత హృతిక్ డ్యాన్స్‌ను కాపీ కొట్టే ప్రయత్నం చేశానంటూ కామెడీ చేశారు బిగ్ బీ. ఈ మధ్య అల్లు అర్జున్ నటనని కూడా మెచ్చుకున్నారు. ఇటీవల అమితాబ్ కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించగా, ఇందులో నటనతో అందరిని అబ్భురపరిచారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంలో అమితాబ్ పాత్ర కూడా కీలకం. ఇక రజనీకాంత్‌తో కలిసి వేట్టాయన్ అనే సినిమా చేశారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.