న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న సంస్థ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (Central Warehousing Corporation) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 179 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. జనవరి 12వ తేదీని దరఖాస్తులకు గడువుగా నిర్ణయించారు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. వివిధ దశల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియను నిర్వహిస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న సీడబ్ల్యూసీ కార్యాలయాలు, కన్స్ట్రక్షన్ సెల్స్, ఐసీడీఎస్, సీఎఫ్ఎస్ఎస్, వేర్ హౌస్‌లలో నియమిస్తారు. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకామ్, సీఏ, పీజీ, ఎంబీఏ ఉత్తీర్ణులు అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. మరిన్ని వివరాలకు గాను అభ్యర్థులు https://cewacor.nic.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య 179 కాగా ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ పోస్టులు 40 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ పోస్టులు 13, అకౌంటెంట్ పోస్టులు 9, సూపరింటెండెంట్ పోస్టులు 22, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 81, సూపరింటెండెంట్ ఎస్ఆర్డీ ఎన్ఈ పోస్టులు 2, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డీ ఎన్ఈ పోస్టులు 10, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డీ లడఖ్ యూటీ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి.
మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.60వేల నుంచి రూ.1.80 లక్షల వేతనం చెల్లిస్తారు. అకౌంటెంట్, సూపరింటెండెంట్ పోస్టులకు రూ.40వేల నుంచి రూ.1.40 లక్షల వరకు జీతం ఉంటుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.29వేల నుంచి రూ.93వేల వరకు వేతనం చెల్లిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 12.01.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు రూ.1350 కాగా రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన వారు రూ.500 చెల్లిస్తే చాలు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.