హెల్తీ డ్రింక్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పానీయం కొబ్బరి నీళ్లు. ఇది సహజ హైడ్రేటింగ్ డ్రింక్. ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. దీనిలో ఎలక్ట్రోలైట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. నిజానికి కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొంతమందికి మాత్రం ఈ కొబ్బరి నీళ్లు విషంతో సమానం. ఆరోగ్య నిపుణులు కొంత మందికి విషంతో సమానం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 45 కేలరీలు మాత్రమే ఉండడంతో వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచుకోవాలని అనుకునే వారికి ఇదొక మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.
అయితే కొందరు మాత్రం కొబ్బరి నీళ్లకి దూరంగా ఉంటే మంచిది.అధిక రక్తపోటు ఉన్నవారికి కొబ్బరి నీరు మంచిది కాదు. ఎందుకంటే ఇది అధిక సోడియం కారణంగా ఒత్తిడిని మరింత పెంచుతుంది.డయాబెటీస్ ఉన్నవారు చాలా మంది కొబ్బరి నీళ్లు మంచివని తాగుతుంటారు. కానీ డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ వాటర్ లో కూడా షుగర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకునేవారికి కొబ్బరి నీళ్లు మంచివి కావు. మీకు షుగర్ వ్యాధి ఉంటే కొబ్బరి నీళ్లను ఎట్టిపరిస్థితిలో తాగకండి. ప్రేగు సిండ్రోమ్ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీళ్ళల్లో కడుపు నొప్పి, ఉబ్బరం కూడా రావచ్చు. కొబ్బరి నీళ్లలో మూత్రవిసర్జన లక్షణాలు కూడా ఉన్నాయి. అందువల్ల, దీన్ని ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది, దీనివల్ల తరచుగా వాష్‌రూమ్‌కు వెళ్ళాల్సి రావచ్చు.
కిడ్నీ సమస్యలున్న వారు కూడా కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండడంతో అది వారికి విషం మాదిరిగా పని చేస్తుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పొటాషియాన్ని తక్కువగా తీసుకునేవారికి కొబ్బరి నీళ్లు విషంలాగే పనిచేస్తాయి. ఇది హైపర్కలేమియాకు దారితీస్తుంది.శస్త్రచికిత్స సమయంలో, ఆ తర్వాత రక్తపోటు, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మీరు కొబ్బరి నీళ్లను తాగకూడదు. శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు కొబ్బరి నీళ్లను తాగడం ఆపేయాలి. ఇది మీ ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. గర్భం దాల్చిన వారు కూడా కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగేస్తుంటారు. గర్భందాల్చిన మొదటి మూడు నెలల్లో కొబ్బరినీళ్లను తాగకపోవడమే మంచిది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల జలుబు చేస్తుంది. ఇది గర్భస్రావం, మంట లక్షణాలను పెంచుతుంది.