Subbaraju Wedding : తెలుగు ప్రేక్షకులకి సుబ్బరాజు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కమెడీయన్‌గా, విలన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు.బాహుబలి 2 చిత్రంతో నేషనల్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర పర్సనల్ కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన అనుకోని విధంగా ఆయన దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా చేరి ఖడ్గం సినిమాలో చిన్న పాత్ర చేశాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులని అలరించాడు.
ఖడ్గం తర్వాత సుబ్బరాజు ఆర్య, శ్రీ ఆంజనేయం, నేనున్నాను, సాంబ, భద్ర, పౌర్ణమి, స్టాలిన్, దేశముదురు, అతిథి, తులసి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, బిల్లా, ఖలేజా, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, లీడర్, బిందాస్, గోల్కొండ హైస్కూల్, దూకుడు, పంజా, బిజినెస్ మ్యాన్, ఎవడు, శ్రీమంతుడు, బాహుబలి 2, దువ్వాడ జగన్నాథం, గీతా గోవిందం, ఎఫ్ 2, మజిలీ, గద్దల కొండ గణేష్, అఖండ, సర్కారు వారి పాట, వాల్తేరు వీరయ్య, శాకుంతలం, బ్రో తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించాడు సుబ్బరాజు.సుబ్బరాజు 47 ఏళ్ల వయసులో ఒక ఇంటివాడు అయ్యారు. ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆసక్తి లేదు అని చెబుతూ వచ్చిన సుబ్బరాజు ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కారు.
పెనుమత్స సుబ్బరాజు పెళ్లి చేసుకున్న విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన భార్యతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఫొటోలో సుబ్బరాజు దంపతులు వధూవరుల గెటప్‌లో చాలా సింపుల్‌గా కనిపించారు. అయితే గతంలోనూ సుబ్బరాజు ఇలాంటి ఫోటోలను షేర్ చేసి సినిమా ప్రమోషన్ కోసం అంటూ అందరిని బోల్తా కొట్టించారు. మరి ఈ ఫొటో కూడా అలాంటిదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజులలో అయితే దీనిపై క్లారిటీ రానుంది. అయితే వెన్నెల కిషోర్‌తో పాటు ఎంతో మంది ప్రముఖులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇది నిజమేనని నెటిజన్స్ భావిస్తున్నారు.