Aish-Abishek : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. అన్యోన్యంగా ఉంటున్న జంటలు కూడా సడెన్‌గా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ విడాకుల గురించి హాట్ హాట్ డిస్కషన్ నడుస్తుంది. కొన్నాళ్లుగా వీరు కలిసి కనిపించకపోవడం, అనంత్ అంబానీ వివాహ వేడుకకు కూడా విడివిడిగా హాజరుకావడం, తదనంతర పరిణామాలన్నీ వీరి విడాకులు తీసుకోవడం ఖాయమని తేల్చాయి. అంతేకాదు ఈ మధ్య నటి నిమ్రత్ కౌర్ తో అభిషేక్ బచ్చన్ ప్రేమాయణం నడుపుతుండడం వల్లనే వారి విడాకులు కన్‌ఫాం అయ్యాయని కూడా కొందరు ప్రచారాలు చేశారు.
ఎన్ని ప్రచారాలు జరిగిన కూడా వీరిద్దరు స్పందించింది లేదు. దీంతో త్వరలోనే విడాకుల ప్రకటన చేస్తారని అందరు అనుకున్నారు. కాని ఒక్క ఫొటోతో రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టేశారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ గురువారం రాత్రి ముంబైలోని సన్ఎన్ సాండ్ హోటల్‌లో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌లో కలిసి మెరిశారు. ఈ ఈవెంట్ లో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ బాలీవుడ్ జంట అయేషా జుల్కా, అను రంజన్, ఇతరులతో కలిసి కనిపించారు. అలాగే ఐశ్వర్య తల్లి బృందా రాయ్ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. చిత్ర నిర్మాత అను రంజన్ షేర్ చేసిన ఫోటోలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, బృందా రాయ్ హై ప్రొఫైల్ పార్టీలో సెల్ఫీకి పోజులిచ్చారు.
ఇదే పెళ్ళికి ఇద్దరూ కలిసి హాజరు కాగా ఇద్దరు కలిసి కనిపించిన పలు హ్యాపీ మూమెంట్ ఫోటోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. వీటిలో అభిషేక్ – ఐశ్వర్య ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఐశ్యర్య, అభిషేక్ ఇలా కలిసి కనిపించింది లేదు.ఈ ఫోటోల్లో అభిషేక్ నలుపు సూట్, ఐశ్వర్య నలుపు రంగు డిజైనర్ వేర్ ధరించారు. కలర్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. వీరి మధ్య అవగాహన కుదిరింది. విడాకుల వార్తల్లో నిజం లేదన్న మరో వాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికైన తప్పుడు ప్రచారాలు ఆపండి అని ఐష్,అభిషేక్ ఫ్యాన్స్ అంటున్నారు.