Akhil Akkineni : అక్కినేని అఖిల్ ఇలాంటి షాకిచ్చాడేంటి.. సైలెంట్‌గా ఆమెతో నిశ్చితార్థం..!

Akhil Akkineni : అక్కినేని అఖిల్ ఇలాంటి షాకిచ్చాడేంటి.. సైలెంట్‌గా ఆమెతో నిశ్చితార్థం..!

Akhil Akkineni : అక్కినేని ఇంట ఇక సంద‌డే సంద‌డి. వ‌రుస వేడుక‌ల‌తో అక్కినేని ఫ్యామిలీ అభిమానుల ఆనందం అవ‌ధులు దాట‌డం ఖాయం.స‌మంత నుండి విడిపోయిన నాగ చైత‌న్య శోభిత‌తో ప్రేమ‌లో ప‌డి ఆమెతో ఆగ‌స్ట్ 8న ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్నాడు. డిసెంబ‌ర్ 4న పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అక్కినేని నాగచైతన్య పెళ్లి దగ్గరపడుతుండటంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. అందాల భామ శోభిత ధూళిపాళతో చైతన్య పెళ్లి జరుగుతుండటంతో ఇరు కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ పెళ్లిని చాలా సింపుల్‌గా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారు. అయితే, ఇప్పుడు అక్కినేని ఇంట్లో మరో శుభకార్యం కూడా జరిగింది.

జైనాబ్ రావుద్జీ‌తో అఖిల్ నిశ్చితార్థం సన్నిహితులైన కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన జైనాబ్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా.. ఆమె సృజనాత్మకత, సంస్కృతి పట్ల ఆమెకున్న ప్రేమ అఖిల్‌కి దగ్గరయ్యేలా చేసినట్లుగా సమాచారం. వీరి నిశ్చితార్థం నాగార్జున ఇంటిలో జరిగినా.. వివాహానికి సంబంధించి ఇంకా ఎటువంటి తేదీని నిర్ణయించలేదని తెలుస్తోంది. వీరి వివాహం వచ్చే ఏడాది ఉంటుందని అక్కినేని సన్నిహిత వర్గాలు మాట్లాడుకుంటున్నారు. నాగార్జున ఎంగేజ్‌మెంట్ పిక్స్ షేర్ చేస్తూ..‘‘జైనబ్‌తో మా తనయుడు అఖిల్ నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం.

కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి’ అని నాగార్జున పోస్ట్‌ పెట్టారు. అలాగే అఖిల్‌ కూడా తన శుభవార్తను సామాజిక మాధ్యమాల వేదికగా అందరితో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ జంట‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో ‘అయ్యగారు సడెన్ గా ఇలా సర్ ప్రైజ్ ఇచ్చారేంటి’? అని సినీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.