Akhil – Zainab Ravdjee : డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం జరగనున్నట్టు ఇటీవల నాగార్జున ఓ ప్రకటన చేశారు. దీంతో అందరు ఈ పెళ్లి గురించి ముచ్చటించుకోవడం మొదలు పెట్టారు. అయితే నాగ్ సడెన్‌గా తన సోషల్ మీడియా ద్వారా అఖిల్ ఎంగేజ్‌మెంట్ విషయం చెప్పేసరికి అక్కినేని అభిమానుల ఆనందం అవధులు దాటింది. ఓ వైపు చైతూ-శోభిత పెళ్లి పనులు వేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకోవడంతో అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్ లభించిందని చెప్పాలి.అక్కినేని యంగ్ హీరో అఖిల్ నిశ్చితార్థం సన్నిహితుల మధ్య జరిగినట్లుగా అక్కినేని నాగార్జున తాజాగా ప్రకటించడంతో ఆమె గురించి నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
జైనబ్‌ని కోడలిగా తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామని.. ఆమె రాక తమకు మరింత సంతోషాన్ని కలిగించిందని నాగార్జున తెలిపాడు.అయితే జైనబ్‌కి సంబంధించిన కొన్ని విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.జైనబ్ రవ్జీ అఖిల్ కంటే పెద్దది అని తెలుస్తుంది. అఖిల్ కి 30 ఏళ్ళు కాగా జైనబ్ రవ్జీకి 39 ఏళ్ళు అని సమాచారం. ఇక జైనబ్ రవ్జీ థియేటర్ ఆర్టిస్ట్, ఒక పెయింట్ ఆర్టిస్ట్ అని సమాచారం. ఆమె వేసిన పెయింట్స్ పలు పెయింట్ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శించబడినట్టు తెలుస్తుంది. ఇక జైనాబ్ రవ్జీ హైదరాబాద్ లో పుట్టినా ఢిల్లీ, దుబాయ్, ముంబైలో పెరిగింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్టు సమాచారం. ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేది కానీ నేడు అఖిల్ తో నిశ్చితార్థం ప్రకటించాక ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని ప్రైవేట్ గా మార్చేసింది.
ఆమె అకౌంట్ ని రానా, మిహీక, ఉపాసన, మెహ్రీన్.. ఇలా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఫాలో అవుతున్నారు. అలాగే జైనాబ్ రవ్జీకి రానా భార్య మిహీకకు మంచి స్నేహం ఉంది. జైనాబ్ రవ్జీ సొంతంగా ఓ బ్యూటీ కేర్ కంపెనీ కూడా నడిపిస్తుంది.జైనాబ్ రవ్జీ తండ్రి జుల్ఫీ రావడ్జీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు అని, దుబాయ్ చుట్టుపక్కల అరబ్ దేశాల్లో ఏపీ ప్రభుత్వం తరపున జగన్ అడ్వైజర్ గా కూడా ఉన్నారని సమాచారం. అలాగే నాగార్జునకు కూడా బిజినెస్ పరంగా అత్యంత సన్నిహితుడు అని తెలుస్తుంది. నాగ్-జుల్ఫీకి కొంత కాలం నుండి స్నేహం ఉండగా, ఇప్పుడు దానిని వారు వియ్యంకులుగా మార్చుకుంటున్నారు.