Akhil : అక్కినేని వారింట సందడి వాతావరణం నెలకొంది. నాగ చైతన్య- శోభితల పెళ్లి కోసం కొద్ది రోజులుగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, ఆ ఘట్టం ముగిసింది. ఇప్పుడు అఖిల్-జైనబ్ పెళ్లి గురించి ముచ్చటించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం జైనబ్ రావ్డ్జీతో అఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుక అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో నాగార్జున ట్వీట్ చేస్తూ.. ‘జైనబ్ తో మా కుమారుడు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జరిగిందని తెలియజేసేందుకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి’ అంటూ నాగార్జున హింట్ ఇచ్చారు.
అయితే అఖిల్-జైనబ్ పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయంలో అక్కినేని చిన్న కోడలు నాగ చైతన్య-శోభిత పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. జైనాబ్ తన కాబోయే భర్త అఖిల్ అక్కినేనితో సరదాగా కనిపిస్తుంది. జైనాబ్.. అక్కినేని కుటుంబంతో కలిసి మెలిసి కనిపించడంతో ఆమె పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం తనకి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక జైనాబ్ అఖిల్, అతని కుటుంబంతో కలిసి బంగారు రంగు చీరలో పద్దతిగా కనిపించింది. ఇక నాగార్జున.. 2025లో అఖిల్, జైనాబ్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రకటించారు. జైనాబ్ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. అఖిల్ సైతం ఈమెతో కలిసి దిగిన కొన్ని ఫోటోలని షేర్ చేసాడు.
ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ అని తెలుస్తుండగా, ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇండియాలోనే కాకుండా దుబాయ్ లండన్ లోను ఆర్టిస్ట్ గా ఆమెకు మంచి పేరు ఉంది. ఆమె వేసే పెయింటింగ్స్‌కి ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రశంసలు దక్కించుకున్నాయి. హైదరాబాదులో కూడా ఆమె పలు ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మోడలింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఆమె ప్రైవేట్ లైఫ్‌ని ఎక్కువగా ఇష్టపడతారట. అందుకే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిని ప్రైవేట్ లో పెట్టింది. దీన్ని బట్టే ఆమె సెలబ్రిటీ లైఫ్‌కి ఎంత దూరంగా ఉంటారో అర్థమవుతోంది.