Allu Arha : పుష్ప‌2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముద్దు ముద్దుగా మాట్లాడిన అయాన్, అర్హ‌.. మురిసిపోయిన బ‌న్నీ

Allu Arha : పుష్ప‌2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముద్దు ముద్దుగా మాట్లాడిన అయాన్, అర్హ‌.. మురిసిపోయిన బ‌న్నీ

Allu Arha : డిసెంబ‌ర్ 5న భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల‌వుతున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప‌2. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని రూపొందించారు. రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు చిత్ర బందం. గ‌త రాత్రి జ‌రిగిన పుష్ప‌2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ‘పుష్ప 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అంతే కాకుండా యంగ్ డైరెక్టర్స్ వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. అందులో ప్రతీ ఒక్కరు ‘పుష్ప 2’ గురించి స్పెషల్‌గా మాట్లాడేది ఏమీ లేదని, ఈ మూవీ గురించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు తెలుసు అని అన్నారు.

ఈ మూవీలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్‌ను చూసిన రాజమౌళి.. కచ్చితంగా ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారని తెలిపారు. కానీ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రావడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇక ఈ ఈవెంట్‌కి బ‌న్నీ పిల్ల‌లు అయాన్, అర్హ కూడా హాజ‌రై సంద‌డి చేశారు. ఇక అల్లు అయాన్ ముందుగా స్టేజ్ ఎక్కగానే మైక్ అందుకొని ‘‘అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఒక మాట చెప్పాలి. మీ అందరికీ పుష్ప చాలా నచ్చుతుంది. ఇంకా తగ్గేదే లే’’ అంటూ అల్లు అర్జున్ మ్యానరిజంను ఇమిటేట్ చేసి చూపించాడు అయాన్. కొడుకు మాట్లాడుతున్నంతసేపు అల్లు అర్జున్ షాక్‌లోనే ఉండ‌డ‌మే కాక మురిసిపొయాడు

ఇక అర్హ మాత్రం తాను ఎలాంటి స్పీచ్ ఇవ్వాలని అనుకోవడం లేదని స్టేజ్ దిగి వెళ్లిపోవాలనుకుంది. కానీ చివర్లో తాను కూడా ఒక తెలుగు పద్యం చెప్పి అందరికీ షాకిచ్చింది. అర్హ చెప్తున్న తెలుగు పద్యాలు, శ్లోకాలు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో దాని గురించి ప్రస్తావించారు సుమ. దీంతో తను ఒక తెలుగు పద్యం చెబుతానంది. ‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ..’ని మళ్ళీ స్టేజిపై అంతా మంది ముందు ఈజీగా చెప్పేసింది. అంత మంది ముందు అర్హ అలా చెప్పేస‌రికి అంద‌రు స్ట‌న్ అయిపోయారు. ఇక ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్నో హైలెట్స్ ఉండగా అందులో అయాన్, అర్హ స్పీచ్ కూడా ఒక మేజర్ హైలెట్‌గా నిలిచింది.