Allu Arjun-Pawan : బ‌న్నీ పొగ‌రు ఏ మాత్రం త‌గ్గ‌లేదా.. అస‌లు ప‌వ‌న్ బాబాయ్ ఎలా అవుతాడు..!

Allu Arjun-Pawan : బ‌న్నీ పొగ‌రు ఏ మాత్రం త‌గ్గ‌లేదా.. అస‌లు ప‌వ‌న్ బాబాయ్ ఎలా అవుతాడు..!

Allu Arjun-Pawan : గ‌త కొద్ది రోజులుగా మెగా వ‌ర్సెస్ అల్లు వార్ తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ మూవీ ఫంక్షన్‌లో మెగాభిమానులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని అడగగా.. ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ ఫ్యాన్స్‌కి క్లాస్ ఇచ్చాడు. దాంతో బన్నీలో చాలా మార్పు వ‌చ్చింద‌ని మెగా అభిమానులు డిసైడ్ అయ్య‌రు. ఇక అప్ప‌టి నుండి అభిమానులు బ‌న్నీలో మార్పు గ‌మనిస్తూనే ఉన్నారు. ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి‌కి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్లడం, అక్కడ ఆయన చేసిన కామెంట్స్.. అల్లు అర్జున్‌ని పూర్తిగా మెగా బ్రాండ్‌కి దూరం చేశాయి. పుష్ప‌2 సినిమాకి కూడా నెగెటివ్ కామెంట్స్ చేశారు మెగా అభిమానులు

ఇక బ‌న్నీ చేసిన ప‌నిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌న‌సులో పెట్టుకోకుండా ఏపీలో టిక్కెట్ రేట్స్ పెంచుకునేందుకు స‌పోర్ట్ చేశారు. దాంతో మ‌న‌సు మారిందో ఏమో కాని తాజాగా జ‌రిగిన స‌క్సెస్ మీట్‌లో ప‌వ‌న్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చి, ఇన్ని రికార్డులు సాధించడానికి కారణమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే, మరోసారి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా చెబుతున్నా.. కళ్యాణ్ బాబాయ్ మీకు థ్యాంక్స్ అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

దీంతో అక్కడున్న మెగా అభిమానులు కేకలు వేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తమ సినిమాను ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో గత కొద్ది రోజులుగా మెగా, అల్లు అభిమానుల మధ్య కొనసాగుతున్న సోషల్ మీడియా వార్ ముగిసినట్లేనని అంద‌రు అనుకున్నారు. కాని పవన్ కళ్యాణ్ ఎప్పుడు అల్లు అర్జున్ కు బాబాయ్ అయ్యారు అని అంటున్నారు. ఆయన వరుసకు మామయ్య అవుతాడు కదా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో సందేహం నెలకొంటుంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా బన్నీకి మేనత్త భర్త అంటే మామయ్య అవుతాడు. ఆయన తమ్ముడిగా పవన్ కళ్యాణ్ కూడా మామయ్యే అవుతాడు కదా.గతంలో ఎన్నడూ పవర్ స్టార్ ను ఉద్దేశించి కల్యాణ్ బాబాయ్ అని బన్నీ ప్రస్తావించిన సందర్భాలు లేవు. త‌ల పొగరెక్కి వ‌రుస‌లు కూడా మ‌ర‌చిపోయాడా అంటూ కొంద‌రు ఫైర్
అవుతున్నారు.