Allu Arjun : అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప2 చిత్రం డిసెంబర్ 5న భారీ స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం చిత్ర బృందం చాలా హార్డ్ వర్క్ చేసింది.సినిమా భారీ హిట్ కొడుతుందని మేకర్స్ భావిస్తున్నారు.ఇక అల్లు అర్జున్ కూడా మూవీపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. రీసెంట్‌గా తన సోషల్ మీడియాలో ఐదేళ్ల పుష్ప ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. పుష్పకు సంబంధించి చివరి రోజు… చివరి షాట్… ఎంత అద్భుతమైన ప్రయాణం అని పేర్కొన్నాడు. ఈ మేరకు చిత్రీకరణకు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫొటోను కూడా పంచుకున్నాడు.
ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. పలు ప్రాంతాలలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. కొచ్చిలో జరిగిన ఈవెంట్‌లో బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఓ గుడ్ న్యూస్ కూడా అందించారు. అల్లు అర్జున్ ..2021 వరకూ ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వచ్చారు. 2021 డిసెంబర్‌లో విడుదలైన పుష్ప మూవీ ఘన విజయాన్ని అందుకుంది. రెండేళ్ల నుండి సుకుమార్ దర్శకత్వంలో పుష్ప – 2 ది రూల్ చిత్రం షూటింగ్‌లో అల్లు అర్జున్ ఉన్నారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ మూవీ పుష్ప -2 గ్రాండ్ రిలీజ్ కాబోతున్నది. అల్లు అర్జున్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలు చేస్తానని అల్లు అర్జున్ ప్రకటించి అభిమానులను ఖుషీ చేశారు.
కొచ్చిలో నిర్వహించిన పుష్ప 2 ఈవెంట్‌లో బన్నీ మాట్లాడుతూ 20 ఏళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలు చేస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు. మలయాళంలో మాట్లాడి ప్రేక్షకులకి మాంచి కిక్ ఇచ్చారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప-2. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 4న రాజమండ్రిలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారట.ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడట. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఇన్‌సైడ్ టాక్