Pushpa2 : ఆకాశాన్ని తాకిన పుష్ప‌2 టిక్కెట్ రేట్లు.. ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడ‌డం సాధ్య‌మేనా?

Pushpa2 : ఆకాశాన్ని తాకిన పుష్ప‌2 టిక్కెట్ రేట్లు.. ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడ‌డం సాధ్య‌మేనా?

Pushpa2 : ఇప్పుడు ఎక్క‌డ చూసిన కూడా పుష్ప‌2 గురించే చర్చ‌. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన పుష్ప‌2 చిత్రం డిసెంబ‌ర్ 5న దేశ వ్యాప్తంగా విడుద‌ల కాబోతుంది.ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల దగ్గర పడుతున్న కొద్ది.. సినిమాపై హైప్స్ పెంచేలా కొత్త అప్డేట్స్ వస్తునే ఉన్నాయి.ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టించారు. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన మరోసారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో రెచ్చిపోబోతున్నారు. ఇక సునీల్, అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, అజయ్ తదితరులు ప్రధాన పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేయ‌గా, ఆయ‌న అందించిన సంగీతంకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

అయితే తే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు, అర్ధరాత్రి 1.00 గంటకు బెనిఫిట్ వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోల టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అంటే పెంచిన రేట్ల‌ను బ‌ట్టి బెన్‌ఫిట్ షో రేట్ల‌ను చూసుకుంటే.. సింగిల్ స్క్రీన్‌లో రూ.1121గా.. మల్టీప్లెక్స్‌లో రూ.1239 గా ఉండ‌నున్నాయి. అయితే సినిమా విడుద‌ల అనంత‌రం డిసెంబ‌ర్ 5 నుంచి నుంచి 23 వ‌ర‌కు సాధ‌ర‌ణ రేట్ల‌ను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. సినిమా విడుదలయిన నాలుగు రోజుల పాటు (డిసెంబ‌ర్ 05 నుంచి 08 వ‌ర‌కు) సింగిల్ స్క్రీన్‌లో రూ.354 గా ఉండ‌బోతుండ‌గా.. మల్టీప్లెక్స్‌లో దీని టికెట్ ధర రూ.531గా ఫిక్స్ చేశారు.

ఇక డిసెంబ‌ర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.300 టిక్కెట్ ధ‌ర ఉండ‌గా.. మల్టీ ప్లెక్స్‌లో రూ.472 ఉండ‌నుంది. అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.200.. మల్టీఫ్లెక్స్‌లో రూ.354గా నిర్ణ‌యించారు. దీంతో ఈ సినిమా టికెట్ రేట్లు దాదాపు 20 రోజుల‌కి కానీ త‌గ్గేలా లేవు.అంటే ఈ సినిమాని ఫ్యామిలీతో క‌లిసి 20 రోజుల వ‌ర‌కు సామాన్య ప్రేక్ష‌కులు వెళ్లే ప‌రిస్థ‌ఙ‌తి లేదు. న‌లుగురు వెళ్లాలి అంటే సింగిల్ స్క్రీన్‌లో రూ.1380 అవ్వ‌నుండగా.. మల్టీప్లెక్స్‌లో రూ.2120లు అవుతుంది. అంత ధ‌ర పెట్టి పోయే ప‌రిస్థితి అయితే లేదనే చెప్పాలి. మ‌రి టిక్కెట్ రేట్స్ పెరుగుద‌ల సినిమాపై ప‌డుతుందా అనేది చూడాలి.