Pushpa 2 : ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీని ఓడించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సమయం చూసుకొని వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం స్కెచ్‌లు వేస్తుంది. మరోవైపు కూటమి ప్రభుత్వానికి ఎలా చెక్ పెట్టాలా అని వైసీపీ నాయకులు తెగ ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్‌కి వ్యతిరేఖంగా ఉన్న వారితో సాన్నిహిత్యంగా మెలిగి తమ పంతం నెరవేర్చుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. బన్నీకి, పవన్ కళ్యాణ్‌కి పడడం లేదని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని అంబటి క్యాష్ చేసుకుంటున్నాడు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం తొలి రోజు వసూళ్లలో జోరు చూపించింది.. ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా పుష్ప 2 తొలి రోజు ఏకంగా రూ.294 కోట్లు గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుని సరికొత్త రికార్డుని నమోదు చేసిందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలోనూ, ఓవర్సీస్‌లోనూ సినిమా సత్తా చాటగా.. హిందీలో రూ.72 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది పుష్ప 2. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ.30 కోట్లు వసూళ్లతో సరికొత్త రికార్డు చేయగా.. అంతేకాదు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు చేసింది.తొలిరోజు ఏకంగా రూూ.294 కోట్లు వసూలు చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
‘ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు 294 కోట్లు కలెక్ట్ చేసినవాడు “మనవాడు” కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది’అంటూ ట్వీట్ చేశారు. అంతకముందు కూడా అంబటి ట్వీట్‌లు చేశారు. ‘”పుష్ప-2″ తెలుగు వారికి పేరు తేవాలి అన్నారు.. Pushpa అంటే WildFire అనుకుంటివా కాదు “World Fire”’ అంటూ ట్వీట్‌లు చేశారు. పుష్ప 2 సినిమాపై అంబిటి మాత్రమే కాదు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కూడా ట్వీట్‌లు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ..ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను పరోక్షంగా విమర్శిస్తూ.. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.ఆంధ్రప్రదేశ్‌ను ‘యంగ్ స్టేట్’ గా పోలుస్తూ రాష్ట్రాన్ని 75 ఏళ్ల వయస్సుగల చంద్రబాబు నాయకత్వం ఇక అనవరసరమంటూ వ్యాఖ్యనించారు. పవన్‌కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ ,అతని వయసు దృష్య్యా ఏపీకి నాయకత్వం వహించే సామర్ద్యం ఉందని తాను నమ్ముతున్నానని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.