Anchor Jhansi : టాలీవుడ్‌లో ఒకప్పుడు యాంకర్స్ అంటే సుమ, ఝాన్సీ, ఉదయ భాను, శిల్పా శెట్టి పేర్లు మాత్రమే వినిపించేవి. అయితే రాను రాను వీరిలో కొందరు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి యాంకరింగ్‌కి దూరంగా ఉన్నారు. సుమ మాత్రం ఇప్పటికీ యాంకర్‌గానే కొనసాగుతుంది. ఝాన్సీ అప్పుడప్పుడు వ్యాఖ్యతగా అదరగొడుతూనే నటిగాను మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోనూ కీలక బాధ్యతలు చూసుకుంటున్నారు ఝాన్సీ. అయితే ఝాన్సీకి 22 ఏళ్ల కూతురు ఉందన్న విషయం పెద్దగా ఎవరికీ తెలీదు.కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటుడు జోగి నాయుడును ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. సహజీవనం చేసినప్పుడు బాగానే ఉన్నా.. పెళ్లి చేసుకున్నాకా ఏడాది కూడా ఈ జంట కలిసి ఉండలేక విడిపోయారు.
అయితే విడిపోయే సమయానికి ఝాన్సీకి కూతురు ఉంది. దీంతో కూతురు కస్టడీ కోసం జోగి నాయుడు ఎంతో ప్రయత్నించారు. కనీసం అప్పుడప్పుడు అన్నా తన కూతురిని చూపించాలని ఝాన్సీని జోగి నాయుడు కోరిన ఆమె ససేమీరా అనేసిందట. తన బిడ్డ మీద బెంగతోనే చాలా కృంగిపోయినట్లు జోగినాయుడు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ తరువాత కొన్నేళ్లకు జోగినాయుడు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఝాన్సీ మాత్రం కూతురును పెంచుకుంటూ ఆమె ఆలనా పాలనా చూసుకుంటుంది. ఝాన్సీ కూతురు పేరు ధన్య కాగా, ఆమె చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 22 ఏళ్లు. ఆమెని సినిమాలలోకి తీసుకురావాలని ఝాన్సీ ప్రయత్నిస్తుంది.
ఝాన్సీ కూతురు ధన్య తాజాగా తన తల్లి ఝాన్సీ తో కలిసి ఆహలో స్ట్రీమింగ్ అవుతున్న కాకమ్మ కథలు అనే టాక్ షో కి వచ్చింది. అయితే ఈ టాక్ షోలో కి హోస్టుగా బోల్డ్ బ్యూటీ తేజస్వి మదివాడ చేస్తుంది. ఆమె అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా, ఇందులో తనకు 22 ఏళ్లు అని, హైట్ 5’9 అని చెప్పింది. అలాగే న్యాచురల్ స్టార్ నాని తన ఫేవరెట్ హీరో అని, మణిరత్నం సినిమాలో నటించాలని ఉందని తన మనసులోని మాటలను బయట పెట్టింది. అలాగే తల్లితో తనకున్న అనుబంధం, చిన్నతనం నుంచి తను పెరిగిన విధానం గురించి ఓపెన్ గా మాట్లాడింది ధన్య. ఇక యాంకర్ ఝాన్సీ ని మీరు రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అంటూ ఒక షాకింగ్ ప్రశ్న అడిగింది తేజస్వి. దానికి ఝాన్సీ చాలా సీరియస్‌గా ఫేస్ పెట్టింది. మరి ఆమె ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చిందా లేదా అనేది చూడాలి.