Anchor Ravi : అసిస్టెంట్‌ని నా మ‌నిషి అనుకున్న యాంక‌ర్ ర‌వి.. ఆయ‌న చేతిలో మోస‌పోయాక‌..!

Anchor Ravi : అసిస్టెంట్‌ని నా మ‌నిషి అనుకున్న యాంక‌ర్ ర‌వి.. ఆయ‌న చేతిలో మోస‌పోయాక‌..!

Anchor Ravi : టాలీవుడ్ మోస్ట్ పాపులర్ మేల్ యాంక‌ర్స్‌లో రవి ఒక‌రు. ఎప్ప‌టి నుండో ర‌వి త‌న‌దైన టాలెంట్‌తో ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ర‌వి బీటెక్ పూర్తి చేశారు. సినిమాల్లోకి అడుగుపెట్టాలన్న లక్ష్యంతో గట్టిగానే ట్రై చేసిన అత‌నికి అవ‌కాశం దక్క‌క‌పోవ‌డంతో కొరియోగ్రఫీ వైపు చూశాడు. అయితే రవిని కింగ్ అక్కినేని నాగార్జున ఇచ్చిన సలహా యాంకరింగ్ వైపు నడిపించింది.ఇక బుల్లి తెర పై పలు షోలకు హోస్ట్ గా వ్యవహారిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న ర‌విలో సోష‌ల్ ఎవేర్‌నెస్ కూడా ఉంది. అత‌ను అడిగిన వారికి సాయం త‌ప్ప‌క చేస్తుంటాడు.

అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ర‌వి అప్పుడ‌ప్పుడు త‌న‌కి సంబంధించిన కొన్ని విష‌యాల‌ని షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన మనిషి అనుకున్నావాడే తనని నమ్మించి మోసం చేశాడని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. గతంలో తాను అసిస్టెంట్ చేతిలో మోసపోయినట్లుగా చెప్పాడు. ఇండస్ట్రీలో అసిస్టెంట్‌లను నమ్మాల్సిన పరిస్ధితి ఉంటుందని.. ఇంటి నుంచి బయల్దేరినప్పుడు కాస్ట్యూమ్స్, నా బ్యాగ్, నా కారు కీ, నా రూమ్ కీస్ అన్ని అతని వద్దే ఉంటాయని అన్నాడు ర‌వి. ఓ రోజున నా అసిస్టెంట్ రాలేదని.. దీంతో లక్ష్మణ్ అని ఓ అబ్బాయిని రమ్మని చెప్పాను. పెట్రోల్ బంక్ దగ్గర డ్రైవర్‌కి కార్డ్ ఇచ్చి పిన్ నెంబర్ చెప్పేవాడిని, ఈ పిన్ నెంబర్‌ను లక్ష్మణ్ నోట్ చేసుకున్నాడు.

నా పర్స్ ఎప్పుడూ నా కారులోనే ఉంటుందని, అందులో ఉన్న రెండు ఏటీఎం కార్డ్స్ అత‌డు కొట్టేశాడని.. ఓ రోజు ఉదయం 50 వేలు డబ్బులు కట్ అయినట్లుగా మెసేజ్ రావడంతో నేను నేరుగా బ్యాంక్ కు వెళ్లి కనుక్కోగా సీసి టీవీ పుటేజ్ లో లక్ష్మణ్ కనిపించాడు. అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్న కానీ పోనిలే అని వదిలేసాను. అతని జీవితం నాశ‌నం అవుతుందని వదిలేసాను అని రవి అన్నాడు.. కొట్టేసిన డబ్బుతో వాడు విజయనగరం పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెండు నిమిషాల్లో దొరికేవాడు.. కానీ వాడి జీవితం నాశనం చేయడం ఇష్టం లేక వదిలేశానంటూ యాంకర్ రవి చెప్పుకొచ్చాడు. ర‌వి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.